కార్తీక్ దే కారు… నా కుమారుడి చేతులు మీద తీసుకున్నాడు

Date:19/09/2020

కర్నూలుముచ్చట్లు:

బెంజి కారు తాను ఎవరికీ బహుమతిగా ఇవ్వలేదని.. తనకు, మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్ స్నేహితుడు మాత్రమే అన్నారు. స్నేహంలో భాగంగా మాత్రమే కొత్త కారుని ఈశ్వర్ చేతుల మీదుగా తీసుకున్నాను అని చెప్పుకొచ్చారు.ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం, ఆయన కుమారుడు ఈశ్వర్‌పై వస్తున్న ఆరోపణలపై తెలకపల్లి కార్తీక్ స్పందించారు. బెంజ్ కారు పేరుతో వస్తున్న విమర్శలపై క్లారిటీ ఇచ్చారు. బెంజి కారు తాను ఎవరికీ బహుమతిగా ఇవ్వలేదని.. తనకు, మంత్రి జయరాం కుమారుడు ఈశ్వర్ స్నేహితుడు మాత్రమే అన్నారు. స్నేహంలో భాగంగా మాత్రమే కొత్త కారుని ఈశ్వర్ చేతుల మీదుగా తీసుకున్నాను అని చెప్పుకొచ్చారు.తాను కారు గత ఏడాది డిసెంబర్‌లో కారు కొనుగోలు చేశానని చెప్పుకొచ్చారు. ఈఎస్ఐ స్కామ్ కేసు 2020 ఏప్రిల్‌లో నమోదైందన్నారు కార్తీక్. తనను జులైలో ఏసీబీ అరెస్టు చేసిందని.. తనకు ఇంకా ప్రభుత్వం నుంచి రూ.1.50 కోట్లు బకాయి రావాల్సి ఉంది అన్నారు.

 

 

 

తాను అరెస్టు కావడం, ఈఎంఐ చెల్లించక పోవటంతో ఆ కారు సీజ్ చేశారన్నారు. ప్రస్తుతం ఆ కారు ఫైనాన్స్ వారి ఆధీనంలో ఉందని.. మంత్రికి కారు బహుమతి ఇస్తే అక్కడ ఎందుకు ఉంటుందన్నారు. తాను ఎందుకు అరెస్టు అవుతానని ప్రశ్నించారు.కారు హైదరాబాద్‌లోని పంజాగుట్ట ననేశ్ ఫైనాన్స్ కంపెనీ దగ్గర ఉందని చెప్పుకొచ్చారు. బెంజి కారు గిఫ్ట్ ఇచ్చాను అనేది అసత్య ఆరోపణలు మాత్రమే., నిజం కాదు.. తనకు మంత్రి జయరాం కుమారుడికి మధ్య స్నేహం తప్ప ఏమీ లేదన్నారు.రెండు రోజులుగా మంత్రి, ఆయన కుమారుడిపై టీడీపీ ఆరోపణలు చేస్తోంది. తెలకపల్లి కార్తీక్ అనే వ్యక్తి మంత్రి కుమారుడికి బెంజ్ కారు లంచగా ఇచ్చారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. కారుతో మంత్రికి సంబంధం లేకపోతే దానిపై ఎమ్మెల్యే స్టిక్కర్ ఎందుకు ఉందని ప్రశ్నించారు. ఆ ఆరోపణలపై మంత్రి కూడా స్పందించారు.. ఆ కారుకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. కారు తన కుమారుడి పేరుపై ఉంటే రాజీనామాకు సిద్ధమన్నారు.

కరోనా పేషంట్ కు డ్రై ఫ్రూట్స్, పండ్లు పంపిణీ

Tags: Karthik de car … took over my son’s arms

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *