Date:30/11/2020
జగిత్యాల ముచ్చట్లు:
ప్రాచీన పుణ్య తీర్ధమైన ధర్మపురి క్షేత్రంలో కార్తీక పౌర్ణమి పర్వదిన పురస్కరించుకుని కార్తీక పౌర్ణమి
వేడుకలు సోమవారం అంగరంగ, వైభవంగా, కన్నుల పండువగా జరిగాయి. జాతర సమయాన్ని మరపించి, భక్తులు, యాత్రికులు, స్థానికులు ఉదయాల్పూర్వం నుండే పవిత్ర గోదావరి నదిలో మంగళ స్నానాలు ఆచరించి, దైవ దర్శనార్థం దేవస్థానంలోని ప్రధానాలయాల ముందు నిలుచున్నారు.సోమవారం వేకువ జామునే ఆలయాల అర్చకులు వేద మంత్రాలతో, మంగళ వాద్యాలతో పవిత్ర జలాలతో, స్థానిక ఇలవేలుపులను అభిషేకించారు. ప్రధానాలయాలైన శ్రీయోగానంద, ఉగ్ర లక్ష్మీ సమేత నారసింహ, శ్రీవేంకటేశ్వర, వేణుగోపాల, యమ ధర్మరాజ, ప్రస న్నాంజనేయ, శ్రీరామలింగేశ్వరాలయాలలో ఉదయం నుండి ప్రత్యేక అర్చనలు, పూజలు, అభిషేకాలు, కంకుమార్చనలు, నిత్య కళ్యాణ ఆది కార్యక్రమాలను నిర్వహించగా, భక్తజనం ప్రత్యేక పూజాదికాలు చేయించి, మొక్కులు తీర్చు కున్నారు. శ్రీవేణుగోపాల, శ్రీవేంకటే శ్వర ఆలయాల మధ్యగల ఉసిరిక వృయక్షంవద్ద వార్తీక దామోదరునికి ఈ సందర్భంగా ప్రత్యేక పూజలోనరించారు. క్షేత్ర పౌరోహితులు పాలేపు బద్రీనాద్ శర్మ , భరత్ కుమార్, అర్చకులకు ఉసిరికల, దీపాలను దానం చేసు కున్నారు. పవిత్ర గోదావరి నదీ జలాలలో దొప్పలలో వెలిగించిన కార్తీక దీపాలను వదిలి పెట్టారు. శ్రీరామలింగేశ్వర ఆలయంలో ప్రత్యేక చండి ప్రదక్షిణాలను ఆచరించారు. ఆలయాల అర్చకులు పంచోపనిషత్ యుక్త వేదోక్త సాంప్రదాయ సిద్ధ పూజలను నిర్వహించారు. ప్రత్యేక పోలీసు బృందాలు, సెక్యూరిటీ బందోబస్తు చర్యలు చేపట్టారు. దేవస్థానంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలను ఆదరించారు.
కార్తీక మాస పార్టమి పరమ పవిత్రం….
కార్తీక మాసం శివకేశవులకు ప్రీతిపాత్రమైన మాసమని, కార్తీక మాసం అందునా పార్లమి, అత్యంత ప్రధానమూ, పరమ పవిత్రమూ అని ధర్మ పురి దేవస్థాన ఆస్థాన వేదపండితులు బొజ్జ రమేశ శర్మ అన్నారు. సోమ వారం రమేశ శర్మ దేవస్థానంలో మాట్లాడుతూ, మానవులకు కావలసిన ఆహార ధాన్యాలలో, పండ్లలో చంద్రుడు కురిపించు వెన్నెల ద్వారా అమృతాన్ని నింపడం జరుగు తుందన్నారు.సోమవారం చంద్రుడు భూమికి అతి దగ్గరగా, లంబముగా నుండునని, దగ్గరకు వచ్చే ఆలౌకిక ఘట్టాన్ని దీపాలతో స్వాగతించడం సత్సాంప్రదాయ మన్నారు. సముద్ర మధనంలో చంద్రుడు, లక్ష్మీదేవిలు కార్తీక పౌర్ణమి రోజునే ఉద్బ వించారని, కనుక ఇది గొప్ప యోగంగా భావించ బడుతున్న దన్నారు. ధర్మపురి క్షేత్రంలోని బ్రహ్మదేవునిచే నిర్మితమైన పుష్కరికి (కోసరు)లో ఈ రోజున పంచనహస్ర దీపాల జ్యోతులతో చంద్రునికి ఆహ్వానం పలికే వినూత్న కార్యక్రమం భక్తి ముక్తి ప్రదాయకమన్నారు. స్థానిక భక్తుల సహ కారంలో ఐదువేల దీపాలను కోనేరులో వెలిగించే కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించిందని బొజ్జా రమేశ్ శర్మ వివరించారు.
మార్చిలోగా వంశధార- నాగావళి అనుసంధానం
Tags; Karthika full moon celebrations at Dharmapuri Kshetra