Date:30/11/2020
కామారెడ్డి ముచ్చట్లు:
కార్తీక పౌర్ణమి దీపోత్సవం కావటంతో కామారెడ్డి పట్టణంలోని విద్యా నగర్ లోని శివాలయంలో భక్తుల రద్దీ… భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శివనామస్మరణతో శివాలయాలు మార్మోగుతున్నాయి. తెల్లవారు జాము నుంచే భక్తులు శివాలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు అభిషేకాలు చేపట్టారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని.. ఆలయాల్లో కార్తీక దీపాలను వెలిగించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయ అర్చకునికి దీపదానం అర్పించారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకుడు శివ కుమార్ మహారాజ్ మాట్లాడుతూ హరిహరులకు ఇష్టమైన కార్తీక మాసం లో కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన దీపదానం చేయడం వలన సుఖ సంతోషాలతో హరిహరుల దీవెనలు పొందుతారు అని తెలిపారు మరియు అనగా ఆదివారము మరియు సోమవారం మధ్యాహ్నం వరకు ఈ కార్తీక పౌర్ణమి ఉంటుందని తెలిపారు కావున సోమవారం అధిక సంఖ్యలో భక్తులు రాగలరని కోరారు ప్రత్యేక పూజలు ఉంటాయని ఆలయ ప్రధాన అర్చకులు జె శివకుమార్ తెలిపారు ఈ కార్తీక పౌర్ణమి పూజా కార్యక్రమంలో కమిటీ సభ్యులు. అధ్యక్షులు- వి. శంకర్ గౌడ్, కార్యదర్శి- ఎం. మోహన్, కోశాధికారి- ఎం జగదీశ్వరా చారి. ఉపాధ్యక్షులు- జి రవీందర్. సంయుక్త కార్యదర్శి -జి.గంగాధర్ గుప్తా. కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మార్చిలోగా వంశధార- నాగావళి అనుసంధానం
Tags: Karthika Full Moon Dipotsavam in Kamareddy town