Date:29/11/2020
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు శ్రీ కాశివిశ్వేశ్వరస్వామి ఆలయ పుష్కరిణిలో కార్తీకదీపోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఆదివారం రాత్రి మున్సిపల్ కమిషనర్ కెఎల్.వర్మ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చిత్తూరు ఎంపీ రెడ్పెప్ప, మాజీ మున్సిపల్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, ఏఎంసీ చైర్మన్ నాగరాజారెడ్డి, మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్, డాక్టర్లు రాజశేఖర్‌రెడ్డి, శివ, సీఐ గంగిరెడ్డి, ఎస్ఐ ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు. వేదపండితుల మంత్రోచ్చరణాల మధ్య కమిషనర్‌తో పాటు ప్రముఖులు కార్తీక దీపాలను తీసుకుని శివాలయంలో పూజలు చేసి , దీపాలను వెలిగించారు. శివనామస్మరణతో పుష్కరిణిలో దీపాలు వెలిగించడంతో ఆ ప్రాంతం భక్తిపారవశ్యమైంది. కోనేరులో ఏటు చూసినా దీపాల కాంతులు మిరుమిట్లు గొలిపాయి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఆవుల అమరేంద్ర, రాజేష్, సురేష్, చందా రెడ్డెప్ప తదితరులు పాల్గొని పూజలు చేశారు.
Tags; Karthikadipotsavam