కార్తీక్ ఎంట్రీపై రాని క్లారీటీ

Karthik's entry on Karthik entry

Karthik's entry on Karthik entry

 Date:14/09/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఉమ్మడి రాష్ట్ర మాజీ హోంమంత్రి, కాంగ్రెస్ నేత సబితా ఇంద్రారెడ్డి మళ్లీ పొలిటికల్ లైమ్‌లైటులోకి వచ్చేస్తున్నారు. కొంతకాలం పాటు స్తబ్ధత పాటించిన సబిత.. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రంగం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. గతంలో టీఆర్ఎస్ పార్టీలో సబిత చేరుతున్నారనే ఊహాగానాలు వెల్లువెత్తిన నేపథ్యంలో వాటిన్నింటికి చెక్ పెడుతూ కాంగ్రెస్‌ తరపునే ఎన్నికల బరిలోకి ఆమె దిగనున్నట్టు తెలుస్తోంది.
చేవెళ్ల చెల్లెమ్మ సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని, ఆమె కుమారుడు కార్తీక్ రాజేంద్ర నగర్ నుంచి పోటీ చేయనున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే కుమారుడు కార్తీక్ రెడ్డి రాజకీయ అరంగేట్రంపై సంప్రదింపులు జరుపుతున్న సబిత.. రాజేంద్ర నగర్ నియోజకవర్గం నుంచి కార్తీక్‌ను ఎన్నికల బరిలో నిలబెట్టేందుకు సన్నద్దమవుతున్నట్టు కనిపిస్తోంది. అయితే కార్తీక్ రెడ్డి అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ పార్టీ ఇంకా ధృవీకరించాల్సి ఉంది.
తన కుమారుడికి ఎమ్మెల్యే టికెట్‌ను ఆశిస్తున్న సబితా.. రాజేంద్ర నగర్ నియోజకవర్గంలో కార్తీక్‌ గెలిచి.. తన తండ్రి ఇంద్రారెడ్డిలా విజయవంతమైన నేతగా తయారుచేసేందుకు మాజీ హోం మంత్రి పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. మరోవైపు కుమారుడు కార్తీక్ కూడా నియోజకవర్గ ప్రజలతో మమేకం అవుతూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ అందరికి టచ్‌లో ఉంటున్నారు.
2009లో చేవెళ్ల నియోజవర్గం నుంచి డిలిమిటేషన్ పద్ధతిలో రాజేంద్రనగర్‌ నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ నేత ప్రకాశ్ గౌడ్ రెండు సార్లు గెలిచారు. అనంతరం ఆయన 2016లో టీఆర్ఎస్‌లోకి జంప్ చేశారు. ప్రస్తుతం ఇక్కడి నియోజకవర్గంలో ప్రకాశ్ గౌడ్‌పై వ్యతిరేకత నెలకొనడం కాంగ్రెస్‌కు కలిసొచ్చేలా ఉంది. దీన్నే సబితా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అవసరమైన ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.
సబితా ఇంద్రారెడ్డి మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లాకు ప్రభుత్వం అన్యాయం చేసిందని అన్నారు. జిల్లాల పునర్విభజనలోనూ జోన్ల ఏర్పాటులోను అన్యాయం జరిగిందని విమర్శించారు. రంగారెడ్డి జిల్లాపై కోపంతో ప్రాణహిత చేవెళ్లను పక్కన పెట్టేశారని మండిపడ్డారు. జిల్లాలో ఈసారి ఎక్కువ సీట్లు గెలుచుకుంటామని సబితా ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను మహేశ్వరం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కార్తీక్ రాజేంద్ర నగర్ నుంచి పోటీ చేస్తాడని ప్రకటించారు.
Tags:Karthik’s entry on Karthik entry

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *