Natyam ad

శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలో కార్తీక బ్రహ్మోత్సవాలు

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం, నెక్కుంది గ్రామంలో వెలసిన దక్షిణ కాశీ అయిన శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాస వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం 17  గురువారం నుంచి 19  శనివారం వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించబడును. 2019 సంవత్సరంలో శిథిలావస్థకు చేరుకున్న ఆలయ రాజగోపురం ప్రహరీ పునర్నిర్మాణంగావించి శాస్త్రోక్తంగా ఆలయ అర్చకుల సాన్నిత్యంలో స్వామివారికి కుంభాభిషేకం జీర్ణోద్ధరణ గావించాము. అప్పటినుంచి ప్రతి సంవత్సరం స్వామివారి కార్తీక బ్రహ్మోత్సవాలు విధిగా నిర్వహించబడుతున్నాయి అందులో భాగంగా ఈ సంవత్సరం 17.11.2022 గురువారం ఉదయం గణపతి ప్రార్థనతో ప్రారంభమై రుద్ర హోమం, మహా మృత్యుంజయ హోమం, ఏకాదశ రుద్రాభిషేకం ,చండీపూర్ణ మంత్ర హోమం ,ఉపగ్రహ సమేత నవగ్రహ హోమం తో పాటు మహా పూర్ణాహుతి గావించి మరియు స్వామివారు అమ్మవార్లకు అభిషేక అర్చనలు జరిపి 19.11.2022 అనగా శనివారం మధ్యాహ్నం 3 గంటలకు స్వామి వారి కళ్యాణం జరిపి సాయంత్రం గజ వాహనోత్సవంతో ఈ ఉత్సవాలు ముగియును. ప్రతిరోజు మధ్యాహ్నం అన్న ప్రసాద వితరణ నిర్వహించబడును. ఆలయ రాజగోపుర ప్రహరీ నిర్మాణ కర్త , ఎన్. వేణుగోపాల్ రెడ్డి చదల్ల
ఆలయ ప్రధాన అర్చకులు షణ్ముగ దీక్షితులు. . ఈ కార్యక్రమంలో ఎన్.వి. ఆర్. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి శివకుమార్ రెడ్డి, నరేంద్ర రెడ్డి, జయ పాల్ రెడ్డి, శంకర్ రెడ్డి, చంద్ర మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, సందీప్ రెడ్డి, వెంకట రెడ్డి, మహేష్ రెడ్డి  పాల్గొన్నారు.

Post Midle

Tags: Kartika Brahmotsavam at Sri Agastishwara Swamy Temple

Post Midle

Leave A Reply

Your email address will not be published.