ఘనంగా భక్తితో కార్తీక పౌర్ణమి

Kartika is full of great devotion

Kartika is full of great devotion

Date:26/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
శివకేశవులకు అత్యంత ప్రీతికరమైనంది కార్తీకం. అందులోనూ సోమవారం అంటే శివుడి ఎంతో ఇష్టం. ఇక, కార్తీక మాసం మూడో సోమవారం కావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలంలో భక్తుల రద్దీ అధికంగా ఉంది. భ్రమరాంబ మల్లికార్జునస్వామివారి సాధారణ దర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు తీసుకున్న భక్తులు క్యూలో మూడు గంటలు వేచిచూడాల్సి వస్తోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామిని దర్శించుకుంటున్నారు. అలాగే నాగులకట్ట దగ్గర మహిళలు కార్తీక నోములు నోచుకున్నారు. కాళేశ్వరం, వేములవాడ ఆలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. కార్తీక సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
స్వామి దర్శనానికి 4 గంటలకు పైగా సమయం పడుతోంది. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేపట్టారు. ఇక, పంచారామ క్షేత్రాలైన ద్రాక్షారామం, పాలకొల్లు, భీమవరం, సామర్లకోట, అమరావతి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పంచరామాలను ఒకే రోజు దర్శనం చేసుకుంటే జ్యోతిర్లాంగాలను దర్శించిన ఫలం దక్కుతుందని నమ్ముతారు. పశ్చిమగోదావరి జిల్లా జుత్తిగ ఉమావాసుకిరవిసోమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే నత్తారామేశ్వరం శ్రీరామేశ్వరస్వామీవారి ఆలయంలో భక్తులు రద్దీ ఎక్కువగా ఉంది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా యానాంలో కార్తీక మాసం మూడో సోమవారం సందర్భంగా శ్రీ రాజారాజేశ్వర సహిత రాజారాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అలాగే అన్నవరం రమా సత్యనారాయణ స్వామి సన్నిధిలో తెల్లవారుజాము నుంచి కార్తీక దీపాలు వెలిగించి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యనారాయణ వ్రతాల కోసం భక్తులు బారులు తీరారు.
Tags:Kartika is full of great devotion

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *