Natyam ad

పుంగనూరు కోనేటిలో కార్తీక వెలుగు

పుంగనూరు ముచ్చట్లు:

కార్తీకమాసం పురస్కరించుకుని సోమవారం రాత్రి స్థానిక పుష్కరణి కార్తీక వెలుగులో ధగధగ వెలిగింది. మహిళలు భక్తిశ్రద్దలతో పూజలు చేశారు. పట్టణంలోని మహిళలు పుష్కరణిలో వెలిగించారు. ఈ వెలుగుతో పుష్కరణికి కార్తీక శోభ అద్దింది. హిందూజాగరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి నిర్వాహకులు మట్టిదీపాలను సమకూర్చారు. మహిళలు పుష్కరణిలో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు , ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రతినిధులు, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి. ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags:Kartika light in Punganur Koneti

Post Midle

Leave A Reply

Your email address will not be published.