న‌వంబ‌రు 23న శ్రీనివాసమంగాపురంలో కార్తీక వనభోజనం

Kartika Reunion at Srinivasamangapuram on November 23rd

Kartika Reunion at Srinivasamangapuram on November 23rd

Date:21/11/2019

తిరుప‌తి ముచ్చట్లు:

టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో న‌వంబ‌రు 23వ‌ తేదీ శ‌నివారం కార్తీక వనభోజన కార్యక్రమం జరుగనుంది. ఈ కార‌ణంగా నిత్య‌ కల్యాణోత్సవం ఆర్జిత సేవ ర‌ద్ద‌యింది. పవిత్రమైన కార్తీక మాసంలో ఇక్క‌డ వనభోజన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా ఉదయం 7 గంటలకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకెళ్లి ఉదయం 9 గంటలకు శ్రీవారి మెట్టు వద్దగల పార్వేట మండపానికి వేంచేపు చేస్తారు. అక్కడ ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు. ఆ తరువాత అలంకారం, వ‌న‌భోజ‌నం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. అక్క‌డి నుండి సాయంత్రం 4 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటారు.

 

23 న కార్తీక వన భోజనం

 

Tags:Kartika Reunion at Srinivasamangapuram on November 23rd

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *