నవంబరు 27న కార్టోశాట్-3 ప్రయోగం

Kartosat-3 launch on November 27th
Date:21/11/2019
నెల్లూరు ముచ్చట్లు:
కార్టోశాట్-3 ప్రయోగ తేదీని మార్చేశారు. రెండు రోజులు ఆలస్యంగా ఈ ప్రయోగాన్ని చేపట్టనున్నట్లు ఇస్రో చెప్పింది. వాస్తవానికి ఈనెల 25వ తేదీన ఈ ప్రయోగాన్ని నిర్వహించాల్సి ఉంది. అయితే షెడ్యూల్‌ను మార్చినట్లు తాజాగా ఇస్రో తన ట్వీట్లో కొత్త తేదీని ప్రకటించింది. నవంబరు 27వ తేదీన ఉదయం 9 గంటల 28 నిమిషాలకు కార్టోశాట్-3 ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సీ47 రాకెట్ ద్వారా ప్రయోగించనున్నట్లు వెల్లడించింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఉన్న రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి కార్టోశాట్3 నింగిలోకి దూసుకువెళ్తుంది. కార్టోశాట్-3తో పాటు మరో 13 కమర్షియల్ నానోశాటిలైట్లను కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. హై రెజల్యూషన్ ఇమేజింగ్ సామర్థ్యం ఉన్న ఉపగ్రహంగా కార్టోశాట్-3ని రూపొందించారు. ఇది థార్డ్ జనరేషన్‌కు చెందినది. కార్టోశాట్-2 ఉపగ్రహంతో పోలిస్తే కార్టోశాట్-3 అత్యంత అధునాతనమైనది. దీంట్లో హై రిజల్యూషన్ వ్యవస్థ ఉంటుంది. దీంతో 25 సెం. మీ. రిజల్యూషన్‌తో, 16 కి. మీ. పరిధిలో ఈ ఉపగ్రహం ఫొటోలు తీస్తుంది. కార్టోశాట్-3లో మల్టీస్పెక్ట్రల్(విద్యుదయస్కాంత స్పెక్ట్రమ్ పరిధిలోపల చిత్రాల్ని తీయడం), హైపర్ స్పెక్ట్రల్(విద్యుదయస్కాంత స్పెక్ట్రవ్ు పరిధిని దాటి చిత్రాలు తీయడం) వంటి అధునాతన వ్యవస్థలు ఉన్నాయి. దీంతో ఉగ్రవాద శిబిరాలు, దాక్కున్న శత్రువులకు సంబంధించిన ఫొటోలను జూమ్(పెద్దగా) చేసి తీసే వీలు కలుగుతుంది.
శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల వాహనసేవల వైశిష్ట్యం
Tags:Kartosat-3 launch on November 27th