డాక్టర్‌ శివకు అబ్ధుల్‌కలామ్‌ అవార్డును అందజేసిన ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి

Karunakara Reddy MLA presented Dr Abdulkalam Award

Karunakara Reddy MLA presented Dr Abdulkalam Award

Date:24/10/2019

తిరుపతి ముచ్చట్లు:

పుంగనూరు లయన్స్ క్లబ్  వ్యవస్థాపకులు , సరళ నర్శింగ్‌ హ్గమ్‌ అధినేత డాక్టర్‌ పి.శివకు మాజీ రాష్ట్రపతి ఏపిజె అబ్దుల్‌ కలామ్‌ అవార్డును తిరుపతి ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి ప్రధానం చేశారు. తిరుపతి మహాతి ఆడిటోరియంలో ప్రజానేస్తం వ్యవస్థాపకులు రాజారెడ్డి ఆధ్వర్యంలో సమాజంలో విశిష్ట సేవలు అందించిన ఐదు మంది ప్రముఖకులకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌కలామ్‌ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ స్టేట్‌ కౌన్సిల్‌ మెంబర్‌ ముత్యంశెట్టి విశ్వనాథ్‌, కమిషనర్‌ కెఎల్‌.వర్మ, పలమనేరు వైఎస్సార్సీపి నాయకుడు ఆకుల గజేంద్రరాయల్‌ తదితరులు హాజరైయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శివకు అవార్డును అందజేసి, శాలువకప్పి సన్మానించారు. ఈ సందర్భంగా విశ్రాంత హెచ్‌ఎం సరస్వతి, ఎన్‌జీవోల సంఘ అధ్యక్షుడు వరదారెడ్డి, తెలుగుముచ్చట్లు డైరెక్టర్‌ పి.ఎన్‌.ఎస్‌.ప్రకాష్‌, లయన్స్క్లబ్‌ ప్రతినిధి గోపాలకృష్ణ కలసి డాక్టర్‌ శివను , కమిషనర్‌ కెఎల్‌.వర్మను, ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ రాష్ట్రకౌన్సిలర్‌ విశ్వనాథ్‌ను గజమాలతో సత్కరించి, వారి సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా డాక్టర్‌ శివ మాట్లాడుతూ ఈ అవార్డుతో తనపై మరింత భాద్యత పెరిగిందన్నారు. అబ్ధుల్‌ కలామ్‌ చూపిన బాటలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి, నిరంతరం ప్రజాసేవలో కొనసాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమానికి తిరుపతి పట్టణంలోని ప్రముఖులు, పాఠశాలల విద్యార్థులు హాజరైయ్యారు. పాఠశాలల విద్యార్థులకు అబ్ధుల్‌ కలామ్‌ జీవిత విధానంపై వివిధ రకాల పోటీలు నిర్వహించి, పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్‌ అకౌంట్స్ ఆఫీసర్‌ మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

సాయి ఆలయంలో ఆరవ అన్నదాన వార్షికోత్సవం

Tags: Karunakara Reddy MLA presented Dr Abdulkalam Award

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *