Natyam ad

కోనసీమలో కశ్మీర్ యాపిల్

శ్రీనగర్ ముచ్చట్లు:


ఏపీలోని కోనసీమలో ఒక ఇంటి యజమాని తన పెరట్లో యాపిల్ కాయించి భళా అనిపించుకున్నారు. యాపిల్ కాయడానికి  ఎంత మాత్రం అనుకూలించని వాతావరణం లో యాపిల్ కాయడంపై యజమాని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.  డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట శివారు పెద్దగూళ్ల పాలెంలో యాపిల్ కాసింది. యాపిల్ అతి శీతల ప్రదేశాల్లో పండే పంట.. జమ్ము, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ వంటి శీతల ప్రదేశాల్లో పండుతుందని చెబుతుంటారు.  దీనికి భిన్నంగా కోనసీమలో యాపిల్ పండు మొదటిసారిగా పండింది. ఉష్ణోగ్రత అధికంగా ఉండే ప్రదేశాల్లో పండని ఈ ఆపిల్ ను కోనసీమలో ఓ వ్యక్తి తన పెరట్లో పండించాడు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట మండలం, పెదగూళ్ళపాలానికి చెందిన దంగేటి వెంకటేశ్వరరావు ఈ ఘనత సాధించాడు. సైకిల్ పై మొక్కలు అమ్మే వ్యక్తి వద్ద నుంచి యాపిల్ మొక్కను కొనుగోలు చేశాడు.ఆ మొక్కను తన పెరట్లో పాతి ఎనిమిది సంవత్సరాల పాటు పెంచాడు. ఆయన పెట్టుకున్న నమ్మకంతో నేడు ఆ చెట్టు శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇచ్చింది. ఆ చెట్టుకొమ్మకు ఒక యాపిల్ కాసింది. ఈ విషయం తెలిసిన పలువురు ఆపిల్ చెట్టును చూసి వెళ్తున్నారు. ఎక్కడో శీతల ప్రదేశాల్లో పండే యాపిల్ ఇక్కడ ఉండడం చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఉద్యాన శాఖ అధికారి భబితను సంప్రదించగా  శీతల ప్రదేశాల్లోనే కాకుండా యాపిల్  దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పండే అవకాశం ఉందని తెలిపారు.

 

 

 

అయితే కాశ్మీర్ వంటి ప్రదేశాల్లో ఉండే యాపిల్ సైజు మిగతా చోట్ల చిన్నదిగా ఉంటుందని వివరించారు.యాపిల్ లో మంచి ఫైబర్, పెక్టిన్ ఉంటుంది. గట్ ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఊబకాయం, బొడ్డు చుట్టూ వచ్చే కొవ్వుని తగ్గిస్తుంది. జీర్ణక్రియ నెమ్మదించేలా చేస్తుంది. ఎక్కువ సేపు పొట్ట నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దాని వల్ల ఆహారం తినడం తగ్గిస్తారు. ఫలితంగా బరువు తగ్గుతారు. మరొక అధ్యయనంలో 74 మంది పెద్దలు రాత్రిపూట నారింజ రసం తీసుకున్నారు. ఇందులో కూడా 5-20 గ్రాముల పెక్టిన్ పొందారు. అతి తక్కువ మోతాదులో దీన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపించినట్టు పరిశోధకులు తెలిపారు.100 గ్రాముల యాపిల్ లో 19 గ్రాముల చక్కెర, 3 గ్రాముల ఫైబర్ ఉంటుంది. పాలీఫెనాల్స్ కి మంచి మూలం. బెల్లీ ఫ్యాట్ ని కరిగించడంలో పాలీఫెనాల్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని పలు అధ్యయనాలు నిర్ధారించాయి. ఒక మీడియం సైజు యాపిల్ లో 27 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. యాపిల్ లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. జీవక్రియని మెరుగుపరుస్తుంది.

 

 

 

Post Midle

ఇందులోని విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. మెదడు ఆరోగ్యాన్ని పెంచుతుంది. యాపిల్ నుంచి మరిన్ని ప్రయోజనాలు పొందాలంటే తప్పకుండా తొక్కతో కలిపి తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.పెక్టిన్, డైటరీ ఫైబర్ గుణాలు గ్యాస్ట్రిక్ సమస్యలని తగ్గిస్తాయి. పేగు పనితీరుని మెరుగుపరుస్తాయి. మలబద్ధకం సమస్యని నివారిస్తాయి. పెక్టిన్ గ్యాస్ట్రిక్ ఆమ్లంతో కలిసి ప్రీబయోటిక్ గా మారతాయి. ఇవి గట్ ఆరోగ్యానికి చాలా మంచిది. యాపిల్ లేదా సిట్రస్ పండ్ల నుంచి వచ్చే పెక్టిన్ లు గట్ బ్యాక్టీరియాకు విలువైన కార్బన్ మూలాలు అని గతంలోని కొన్ని అధ్యయనాలు నిరూపించాయి. గట్ హెల్త్ బెల్లీ ఫ్యాట్ ని తగ్గించడంలో సహాయపడుతుంది.

 

Tags: Kashmir apple in Konaseema

Post Midle