కస్తూర్బాల్లో కల్తీ వస్తువులతోనే అంతా

Date:14/07/2018
కరీంనగర్ ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో గురుకుల పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేయడంతో పాటు వసతుల కల్పన బోధన, ఆహార పదార్థాల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. గురుకుల పాఠశాలలకు కూరగాయలు, చికెన్, మటన్, పాలు, గుడ్లు అందించేందుకు టెండర్లు పిలిచారు. వీటితో పాటు కస్తూర్బా బాలికల విద్యాలయాలకు ఇదే నిబంధనలు అమలు చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో సోషల్ వెల్పేర్ గురుకుల పాఠశాలలు ఐదు, బిసి గురుకుల పాఠశాలలు ఆరు, మైనార్టీ గురుకులాలు ఏడు, మోడల్ స్కూల్స్ రెండు, కస్తూర్బా పాఠశాలలు 14 ఉన్నాయి. ఇందులో మూడు జూనియర్ కళాశాలలు కూడా ఉన్నాయి. పైన పేర్కొన్న విద్యాలయాలకు కూరగాయలు, ఇతరత్రా సరఫరా చేసేందుకు టెండరు పొందిన కాంట్రాక్టర్లు నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నారు. ముఖ్యంగా మాంసం విషయంలో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న మేకలు, గొర్రెల మాంసాన్ని సరఫరా చేస్తున్నారని కొందరు మరణించిన జంతువుల మాంసాన్ని కూడా సరఫరా చేస్తున్నారన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఇక కూరగాయల విషయం మరీ ఘోరం. మార్కెట్‌లో అతి తక్కువ ధర కలిగిన నాణ్యత లేని వాటిని మాత్రమే సరఫరా చేస్తున్నారు. చికెన్ విషయంలోనూ ఇదే జరుగుతున్నదనే ఆరోపణ. నెలలో రెండు సార్లు మాంసం, నాలుగు సార్లు చికెన్ వడ్డించాల్సి ఉంది. కొందరు ఉన్నతాధికారులు కాంట్రాక్టర్లతో చేతులు కలపడంతో గురుకుల పాఠశాలల ప్రిన్సిపాల్స్ ఏం మాట్లాడలేకపోతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని నాణ్యమైన ఆహార పదార్థాలను అందించేవిధంగా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
కస్తూర్బాల్లో కల్తీ వస్తువులతోనే అంతాhttps://www.telugumuchatlu.com/kasturba-is-all-with-adulterous-items/
Tags; Kasturba is all with adulterous items

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *