‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ లో కత్రినా ఫస్ట్ లుక్

Katrina first look in 'Thugs of Hindustan'

Katrina first look in 'Thugs of Hindustan'

Date:21/09/2018
ముంబై ముచ్చట్లు:
ప్రస్తుతం మేకింగ్ దశలో ఉండి బాగా ఆసక్తిని రేకెత్తిస్తున్న బాలీవుడ్ సినిమాల్లో ‘థగ్స్ ఆఫ్ హిందూస్తాన్’ ముందుంది. ఆమిర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా ఇండియన్ సినిమాస్ వసూళ్ల రికార్డులను తిరగరాయడం ఖాయమనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. తాజాగా ఇందులో కత్రినా కైఫ్ ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. మోషన్ పోస్టర్‌ ద్వారా ఈ లుక్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో కత్రినా కైఫ్ సురయ్యా అనే డ్యాన్సర్ పాత్రను చేస్తున్నట్టుగా ఈ ఫస్ట్‌లుక్ తో స్పష్టం అవుతోంది.
గోల్డెన్ కలర్ బ్యాక్‌గ్రౌండ్తో.. తన నాజూకు నడుము అందాలను చూపుతున్న కత్రినా కైఫ్ ఫస్ట్ లుక్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోందిప్పుడు. అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. దీపావళి సందర్భంగా ఈ సినిమా విడుదల కానుంది.
Tags:Katrina first look in ‘Thugs of Hindustan’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *