మళ్లీ వివాదంలో కాటసాని…

కర్నూలు ముచ్చట్లు :

 

కాటసాని రాంభూపాల్ రెడ్డి దశాబ్దాల నుంచి రాజకీయాలు చేస్తున్నారు. ఆయనపై గతంలో ఫ్యాక్షన్ ముద్ర ఉన్నప్పటికీ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయన మారుతూ వస్తున్నారు. ఒకే నియోజకవర్గం నుంచి దాదాపు ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం అంటే సామాన్యమైన విషయం కాదు. పార్టీలు మారినా, ప్రజల అండ ఉందని కాటసాని రాంభూపాల్ రెడ్డి అనేక సార్లు నిరూపించుకోగలిగారు.కాటసాని రాంభూపాల్ రెడ్డి దాదాపు మూడు దశాబ్దాల నుంచి పాణ్యం నియోజకవర్గం కేంద్రంగా రాజకీయాలు చేస్తూ వస్తున్నారు. 1985లో తొలిసారి గెలిచిన ఆయన తర్వాత వెనక్కు తిరిగి చూసుకోలేదు. 1985, 1989, 1994, 2004, 2009 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి పాణ్యం నియోజకవర్గంలో విజయం సాధించారు. 2014లో సయితం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి టీడీపీ అభ్యర్థిని పక్కన పెట్టి తాను ద్వితీయ స్థానంలో ఉన్నారు. 60 వేల ఓట్లను సాధించి ప్రజా బలం ఉందని నిరూపించుకున్నారు. 2019 ఎన్నికల్లో కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆరోసారి విజయం సాధించారు.అయితే కాటసాని రాంభూపాల్ రెడ్డి పై ఇప్పుడు జంట హత్యల వివాదం ఉంది. టీడీపీ నేతలు ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి హత్యల వెనక కాటసాని ఉన్నారన్నది టీడీపీ నేతల ఆరోపణ. చంద్రబాబు, లోకేష్ నుంచి అందరూ అదే విమర్శ చేస్తున్నారు.

 

 

అయితే ఈ హత్య కేసులో నిందితులు టీడీపీ ఇన్ ఛార్జి గౌరు చరితకు 2014 ఎన్నికల వరకూ అనుచరులుగా ఉన్నారు. గ్రామంలో నెలకొన్న వివాదమే ఈ హత్యలకు కారణమని చెబుతున్నారు.ఇక హత్యకు గురైనా ప్రతాప్ రెడ్డి, నాగేశ్వర్ రెడ్డి లు ఇద్దరూ ఒకప్పుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి కి అనుచరులే కావడం విశేషం. అయితే వారు తెలుగుదేశంలోకి మారిపోయి అక్కడే గ్రామంలో నేతలుగా కొనసాగుతున్నారు. వారిని హత్య చేయించాల్సిన అవసరం తనకు లేదంటున్నారు. కేవలం త్వరలో మంత్రి వర్గ విస్తరణ ఉండటం, ఆరు సార్లు గెలవడంతో కాటసానికి ఛాన్స్ ఉందని భావించి ప్రత్యర్థులు బురద జల్లుతున్నారని కాటసాని రాంభూపాల్ రెడ్డి అనుచరులు చెబుతున్నారు. మొత్తం మీద కాటసాని రాంభూపాల్ రెడ్డి ఈ వివాదం నుంచి ఎలా బయటపడతారో చూడాల్సి ఉంది.

 

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: Katsani in controversy again …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *