బిగ్ బాస్ 3 హోస్ట్ గా కౌశల్

Date:14/01/2019
హైద్రాబాద్ ముచ్చట్లు :
తెలుగులో బిగ్ బాస్ రియాల్టీ షో మొదటి సీజన్ 2017లో జరిగింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ చేయడంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తొలి సీజన్‌లో శివ బాలాజీ విన్నర్ అయ్యారు. రెండో సీజన్ మాత్రం కాస్త వినోదం.. మొత్తం వివాదం అనేలా సాగింది. గతేడాది జరిగిన రెండో సీజన్‌కు నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా చేశారు. తన ఆర్మీ భారీ మద్దతుతో కౌశల్ రికార్డ్ ఓట్లతో బిగ్ బాస్ 2 టైటిల్ సాధించారు. బిగ్ బాస్ సీజన్3కి కౌశల్ మండ హోస్ట్‌గా వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతోంది.  కొన్ని రోజులుగా బిగ్ బిస్ మూడో సీజన్‌కు సన్నాహాలు మొదలయ్యాయి. తొలి సీజన్ 70 రోజులపాటు నిర్వహించగా, రెండో సీజన్‌ను 100 రోజులకు పైగా కొసాగింది. మూడో సీజన్ ఎన్ని రోజులు చేస్తార్న దానిపై ఇంకా స్పష్టత లేదు. బిగ్ బాస్ 3 ఎవరు హోస్ట్ చేస్తారు, ఎవరైతే న్యాయం చేయగలరని నిర్వాహకులు కసరత్తులు మొదలుపెట్టారు. నిన్న మొన్నటివరకు బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్‌‌గా నాగార్జున, వెంకటేష్, చిరంజీవి, ఎన్టీఆర్, దగ్గుబాటి రానా, విజయ్ దేవరకొండ వ్యవహరిస్తారని ఇలా ఒక్కొక్క పేరు వైరల్ అయింది. రెండో సీజన్‌లో కౌశల్ పాపులారిటీని దృష్టిని పెట్టుకుని అతడికి బిగ్ బాస్ 3 హోస్ట్‌గా భారీ ఆఫర్‌ను నిర్వాహకులు ఇస్తున్నట్లు సమాచారం. గత సీజన్‌లో బిగ్ బాస్‌నే శాసించే స్థాయికి ఎదిగారు కౌశల్. తడి ఆర్మీ తలుచుకుంటే టీఆర్పీ పెరిగింది, వద్దనుకుంటే తగ్గిన పరిస్థితి తలెత్తింది. దీంతో బిగ్ బాస్ నిర్వాహకులు కౌశల్‌ పేరును పరిశీలిస్తున్నారని, త్వరలో ప్రకటన వస్తుందని సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు. తొలి సీజన్ జూలైలో, రెండో సీజన్ జూన్‌లో ప్రారంభం కాగా, మూడో సీజన్ మరికాస్త ముందుగానే ప్రారంభించనున్నారని తెలుస్తోంది. మరోవైపు కంటెస్టెంట్‌గా చేయడం వేరు, హోస్ట్‌గా చేయడం అంత ఈజీ కాదని అభిప్రాయడుతున్నారు.
Tags:Kaushal as Big Boss 3 host

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed