Natyam ad

కమలంలో కవిత కలకలం

హైదరాబాద్  ముచ్చట్లు:

 

ఒకప్పుడు భారతీయ జనతా పార్టీ ( బీజీపీ) అంటే, అదొక విభిన్న పార్టీ  కానీ, ఇప్పడు కాదు. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో బీజేపీ, అతర్గత కుమ్ములాటలు, ముఠా తగాదాల విషయంలో కాంగ్రెస్ పార్టీకి నకలుగా తయారైంది. ఈ మాట ఎవరో బయటి వారు అంటున్న మాటే కాదు.. బీజేపీలోని  సీనియర్ నాయకులు,   సీనియర్ కార్యకర్తలూ అంటున్నారు. సరే  ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీకి ఉన్నదీ లేదు పోయేది లేదు కనుక అక్కడ ఎలా ఉన్నా ఎన్ని గ్రూపు తగవులు ఉన్నా పార్టీ అధిష్టానం కూడా పెద్దగా పట్టించుకోలేదు.తెలంగాణలో పరిస్థితి అది కాదు. బీజేపీ జాతీయ నాయకత్వానికి తెలంగాణపై చాలానే ఆశలున్నాయి.

 

 

 

 

అధికారం లక్ష్యగా అడుగులు వేస్తోంది. అధికారంలోకి వచ్చినా రాకున్నా పశ్చిమ బెంగాల్  లో లాగా, ఒక బలమైన శక్తిగా ఎదిగే  అవకాశం ఉందని  పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. నిన్న గాక మొన్న హైదరాబాద్ వచ్చిన కేంద్ర్ర హోం మంత్రి, పార్టీ స్ట్రాటజిస్ట్ (వ్యూహకర్త) అమిత్ షా  పార్టీ నాయకులు విబేధాలు మరిచి కలిసి పనిచేస్తే అధికారంలోకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నారు. అదే మాట  ప్రొఫెసర్ నాగేశ్వర్ వంటి రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. త్రిపురలో గెలిచిన బీజీపీ తెలంగాణలో ఎందుకు గెలవదని ప్రశ్నిస్తున్నారు.అయితే  అందరూకలిసి పని చేయాలని చెప్పి  అమిత్ షా అలా వెళ్ళారో లేదో, ఇలా తెలంగాణ రాష్ట్ర బీజేపీలో రుసరుసలు మొదలయ్యాయి. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన అనుచిత వ్యాఖ్యల వివాదం కమల దళంలో దుమారం రేపుతోంది. బండి వ్యాఖ్యలను బీజేపీ నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ తప్పు పట్టారు. అలాగే ఆర్వింద్‌ వ్యాఖ్యలు వంద శాతం సరైనవేనంటూ బీజేపీ మాజీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, సీనియర్‌ నేత శేఖర్జీ  ( పేరాల శేఖర్‌ రావు) సోషల్‌ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు, విమర్శలు పార్టీ నేతల్లో మరింత కలకలానికి కారణమయ్యాయి. అరవింద్ అంటే, కాంగ్రెస్ కల్చర్ లో పుట్టి పెరిగిన నాయకుడు. ఆయన పార్టీ ఎంపీ అయినా, భావజాల పునాదుల పరంగా బీజేపీకి బయటి వ్యక్తి.

 

 

 

 

Post Midle

కానీ  శేఖర్జీ ఆలా కాదు. ఆయన పుట్టి పెరిగింది, బీజేపీ మాతృ సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)లో, సంఘ్ ప్రచారక్ (పూర్తి సమయ కార్యకర్త)గా, అనేక మందికి ఆదర్శంగా నిలిచిన  నాయకుడు.. అయన కూడా క్రమ శిక్షణ ఉల్లంఘించి, సోషల్ మీడియా వేదికగా బండి సంజయ్  మీద విమర్శలు చేయడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. నిజానికి, బండి సంజయ్  పై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలు ఒకెత్తు అయితే, శేఖర్జీ చేసిన విమర్శలు మరింత డ్యామేజింగ్  గా ఉన్నాయని పార్టీ శ్రేణులే అభిప్రాయపడుతున్నాయి. కవిత పై సంజయ్ చేసిన వ్యాఖ్యలపై, బీఆర్ఎస్  ఎంతగా రాద్ధాంతం చేసినా, ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు. నిజానికి బీఆర్ఎస్ కూడా బండి వ్యాఖ్యలను ముందు లైట్ గానే తీసుకుంది, కానీ  ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కవిత అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపించడంతో  ఇష్యూని డైవెర్ట్ చేసేందుకో ఏమో  ఢిల్లీ నుంచి గల్లీ వరకు … బండికి వ్యతిరేకంగా వీధుల్లోకొచ్చి బీఆర్ఎస్ ఆందోళన చేసింది. ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకులు కూడా బండి సంజయ్ వ్యాఖ్యలను మరిచి పోయారు.

 

 

బీజేపీ నాయకులు మాత్రం బండికి అటూ ఇటుగా విడిపోయారు. రాష్ట్ర పార్టీలోని కొందరు నేతలు అర్వింద్, శేఖర్‌జీ వ్యాఖ్యలను సమర్థిస్తుండగా అసెంబ్లీ ఎన్నికల వేళ ఇలాంటివి పార్టీకి నష్టం చేస్తాయని మరికొందరు చెబుతున్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో కవితపై సంజయ్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేకపోయినా అర్వింద్‌ ఖండించడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. అదే సమయంలో సంజయ్‌ వ్యవహారశైలి, రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే పవర్‌ సెంటర్‌ కాదని, అందరినీ సమన్వయం చేయాల్సిన బాధ్యత ఉంటుందని అర్వింద్‌ చేసిన వ్యాఖ్యలను మరికొందరు సమర్థిస్తున్నారు. అర్వింద్‌ చేసిన వ్యాఖ్యలకు కొనసాగింపుగా సంజయ్‌పై శేఖర్జీ మరిన్ని తీవ్ర విమర్శలు, ఆరోపణలు సంధించడంతో పార్టీలో అంతర్గతంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని నేతలు ఆందోళన వెలిబుచ్చుతున్నారు. మరోవైపు వివిధ జిల్లాల్లోనూ పార్టీ ముఖ్య నేతల మధ్య పొసగక గ్రూపుల గందరగోళం కూడా పెరిగినట్లు పార్టీలో చర్చ సాగుతోంది. నిజానికి ఈ వ్యవహారం చినికి చినికి గాలి వానగా మారుతుందా? కేంద్ర పార్టీ ఎలా స్పదిస్తుంది .. చూడాల్సింది చాలా వుంది .. చెప్పాల్సింది మిగిలే వుంది..అంటున్నారు.
Tags;Kavita Kakalam in Kamal

Post Midle