Natyam ad

కవిత… కేరాఫ్ ఢిల్లీయేనా

హైదరాబాద్  ముచ్చట్లు:

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన కుమార్తె కవితను రాష్ట్ర రాజకీయాల నుంచి దూరం పెడుతున్నారా? అందుకు అవసరమైన రంగం సిద్ధం చేసేశారా? అంటే తెరాస వర్గాలు ఔననే అంటున్నాయి. ఆమెను బీఆర్ఎస్ జాతీయ అంతర్జాతీయ మీడియా కోఆర్డినేటర్ ఢిల్లీకే పరిమితమౌతారని తెరాస వర్గాలలో చర్చ జరుగుతోంది.ఇటీవల తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు ప్రపంచ గ్రీన్ సిటీ అవార్డు లభించిన నేపథ్యంలో దాదాపు 300 కోట్ల రూపాయల వ్యయంతో జాతీయ మీడియాకే కాకుండా అంతర్జాతీయ మీడియాకు కూడా అడ్వర్టైజ్ మెంట్లు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందు కోసం ఢిల్లీలో ఆయన బస చేసిన సమయంలోనే కవితను ఆ వ్యవహారాలన్నీ సమన్వయం చేయాల్సిందిగా ఆదేశాంచారని చెబుతున్నారు. ఇందుకోసమే  ఇన్ఫర్మేషన్ కమిషనర్ అరవింద్ కుమార్ ను ప్రత్యేకంగా ఢిల్లీ పిలిపించుకున్నట్లు చెబుతున్నారు.టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్పు చేస్తూ జాతీయ పార్టీగా ప్రకటించిన అనంతరం హైదరాబాద్ కు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వచ్చిన సందర్భాన్ని పూర్తిగా ఉపయోగించుకుని దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా పెద్ద  ఎత్తున ప్రచారం చేసుకోవాలని కేసీఆర్ నిర్ణయించారు. దక్షిణ కొరియాలోని జెజులో జరిగిన ఏఐపిహెచ్‌ 2022 వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్స్ 2022లో హైదరాబాద్ మొత్తం ‘వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డ్ 2022, లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ విభాగంలో మరొకటి గెలుచు కుంది.

 

 

 

దేశం మొత్తంలో ఈ పురస్కారాలకు ఎంపిక అయిన ఏకైక ఇండియన్ సిటీ హైదరాబాద్ మాత్రమే కావడం గమనార్హం.దేశంలోని నగరాలన్నిటినీ తోసి రాజని అంతర్జాతీయ అవార్డునకు హైదరాబాద్ ఎంపిక కావడం రాష్ట్ర పురోగతి, ప్రగతి పట్ల తెరస ప్రభుత్వం చూపిన శ్రద్ధ, కృషి ఉన్నాయని కేసీఆర్ చెబుతున్నారు. జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని, రాష్ట్ర రాజధానిని అగ్రభాగంలో నిలబెట్టిన తన పాలనా దక్షతకు ఈ అవార్డులే నిదర్శనమని చెబుతున్న కేసీఆర్.. ఆ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని భావిస్తున్నారు. కేవలం జాతీయ మీడియాలోనే కాకుండా అంతర్జాతీయ మీడియాలో కూడా తెలంగాణ ఘనతను చాటాలని నిర్ణయించారు.ఇందు కోసం భారీ ఎత్తున ప్రకటనలు విడుదల చేయాలని నిర్ణయించారని విశ్వసనీయ సమాచారం. దేశంలోని అన్ని నగరాల కంటే అత్యద్బుతంగా అభివృద్ధి చెందిన నగరంగా హైదరాబాద్ ఖ్యాతిని ప్రచారం చేయడం ద్వారా తన ప్రభుత్వ పని తీరును విశ్వవ్యాప్తం చేసుకునే ఉద్దేశంతో ఆయన ఉన్నారని అంటున్నారు. అలాగే జాతీయ అంతర్జాతీయ మీడియా సమన్వయ కర్తగా తన కుమార్తె కవిత  హస్తినకు పరిమితం  చేయడం ద్వారా లిక్కర్ స్కాం ప్రకంపనలు జాతీయ పార్టీపై ప్రబావం చూపకుండా జాగ్రత్తలు తీసుకున్నారని అంటున్నారు. అలాగే రాష్ట్ర రాజకీయాల నుంచి కవితను దూరం పెట్టడం ద్వారా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆమెపై వచ్చిన ఆరోపణల ప్రభావం ఇక్కడ ప్రతిఫలించకుండా  ఉండేందుకే కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెరాస వర్గాలే చెబుతున్నాయి.

 

Post Midle

Tags: Kavitha… Is the carafe Delhi?

Post Midle