అణగారిన వర్గాలను అగ్రభాగాన నిలపడమే కేసీఆర్ లక్ష్యం – మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్

పెద్దపల్లి  ముచ్చట్లు:
తెలంగాణలో అణగారిన వర్గాలను అగ్రభాగాన నిలపడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణ గౌడ్ పేర్కొన్నారు. దళిత సాధికారితకు దళితక్రాంతి పేరుతో ప్రత్యేక పథకం ప్రవేశపెట్టిన సంధర్భంగా బుధవారం టీఆరెస్ మండల పార్టీ అధ్యక్షుడు శెంకేశి రవిందర్ ఆధ్వర్యంలో సెంటినరీకాలనీ టీబీజీకేఎస్ కార్యలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటినా దళిత వర్గాలు పేదరికంలోనే మగ్గుతున్నాయని తెలిపారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా దళిత వర్గాలను ఓటు బ్యాంక్ గానే చూస్తున్నారు కానీ వారి అభ్యున్నతికి ఏ ప్రభుత్వం కృషి చేయలేదని, టీఆరెస్ ప్రభుత్వం దళితులకు ఆర్థిక  చేయూత అందించేందుకు నడుం బిగించారని కొనియాడారు. ప్రతి యేటా నియోజకవర్గానికి వంద మందికి  రూ.10 లక్షల చొప్పున అందించి దళిత వర్గాలను ఉన్నత స్థితికి తీసుకురావడానికి ప్రతి సంవత్సరం రూ.1200 కోట్లు బడ్జెట్ లో కేటాయించినట్లు తెలిపారు. ఆత్మగౌరవ నినాదంతో సాధించుకున్న రాష్ట్రంలో అందరూ సమానంతా ఉండటానికి దళిత సాధికారితకు ప్రత్యేక పథకం ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు మండల ప్రజల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అరెల్లి దేవక్కకొమురయ్య, రైతుబంధు సమితి అధ్యక్షుడు మేదరబోయిన కుమార్ యాదవ్, టీఆరెస్ పట్టణ అధ్యక్షుడు కాపురబోయిన భాస్కర్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు ధర్ముల రాజసంపత్, మండల యూత్ అధ్యక్షుడు గారబోయిన నరేష్, గ్రంధాలయ డైరెక్టర్ రాజు లడ్డు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆసం తిరుపతి, ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు దామెర శ్రీనివాస్, నాయకులు వేగోలపు మల్లయ్య, కామ శ్రీనివాస్, వీరస్వామి, ఆర్బీ శ్రీను, బూడిద సమ్మయ్య, వేముల రవిశంకర్, కేశవరావ్ తదితరులు పాల్గొన్నారు.

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

 

Tags:KCR aims to bring the downtrodden to the forefront
– Market Committee Chairman Powdery Satyanarayana Goud

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *