కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం

Date:27/10/2020

రాజన్న  ముచ్చట్లు:

తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజక వర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు బంధువుల ఇళ్లలో పోలీసులతో డబ్బులు పెట్టించి  బండి సంజయ్ ను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ  రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను  దగ్ధం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో ప్రభుత్వానికి పోలీసులు కార్యకర్తలు లాగా పని చేస్తున్నారని ప్రశ్నించే వారిపైన అక్రమ కేసులు పెడుతూ బీజేపీ  కార్యకర్తల పైన దాడి చేయడం పిరికిపందల చర్య అని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో  మండల అధ్యక్షులు కార్తీక్ రెడ్డి కోళ్ల కృష్ణ శ్రీనివాస రావు నరేష్  సంజీవ్ మీస  శంకర్, వంశీ పలువురు బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

లాక్‌డౌన్ విధించినా వెనక్కి తగ్గలేదు.. కర్రల సమరంతో రక్తపాతం

Tags: KCR burns the effigy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *