విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం కేసీఆర్‌కు ఇష్టం లేదు

KCR does not like to officially organize the ransom

KCR does not like to officially organize the ransom

Date:17/09/2018
హైదరాబాద్‌  ముచ్చట్లు:
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం తెరాసకు, కేసీఆర్‌కు ఇష్టం లేదని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ ఆరోపించారు. వేరుగా ఉన్న తెలంగాణను ఆనాడు భారతదేశంలో కలిపింది కాంగ్రెస్సేనని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గాంధీభవన్లో ఆయన జాతీయ జెండాను ఎగుర వేశారు. రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన వారి కోసం స్మారక స్థూపాలు ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్.. ఇంతవరకు ఆ ఊసే ఎత్తలేదని విమర్శించారు.
రాబోయే ఎన్నికలు కేసీఆర్ కుటుంబానికి.. తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్నాయని, తెరాసకు ఘోర పరాభవం తప్పదన్నారు. తెరాసకు ఓటేస్తే భాజపాకు వేసినట్లేనని వ్యాఖ్యానించారు. వ్యతిరేక ఓట్లను తొలగించి ఎన్నికల్లో గెలుపొందాలని తెరాస చూస్తోందని, వారి ఆటలు సాగనివ్వమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఇందిరా పార్క్ వద్ద ధర్నాచౌక్‌ను పునరుద్ధరిస్తామని చెప్పారు. మద్యం అమ్మకాలు, రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు.
ఏపీలో అధికారంతో పాటు ఎంపీ స్థానాలు కోల్పోతామని తెలిసినా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీ ధైర్యంగా నిర్ణయం తీసుకుందని ఉత్తమ్‌ గుర్తుచేశారు.ఈ సందర్బంగాఓటర్లపై హామీల వర్షం కురిపించింది. తమ పార్టీ అధికారంలోకి వస్తే, రైతుకు ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగం లభించని నిరుద్యోగికి నెలకు రూ. 3 వేల భృతిని ఇస్తామని చెప్పారు.ఇందిరాపార్కు వద్ద శాశ్వతంగా ధర్నా చౌక్ ను నిర్మిస్తామని, నిరసన తెలపాలని భావించే ప్రజలు శాంతియుతంగా ఇక్కడ ధర్నాలు నిర్వహించుకోవచ్చని అన్నారు.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో రిజిస్టర్ అయిన 19 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధిని చూపించే కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. వీరిలో 9 లక్షల మంది వరకూ ప్రైవేటు కంపెనీల్లో పని చేస్తున్నారని, నెలకు రూ. 300 కోట్లు ఖర్చు పెట్టి 10 లక్షల మందికి నిరుద్యోగ భృతిని ఇస్తామని అందిస్తామని చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆరు లక్షల మహిళా సంఘాల్లోని 70 లక్షల మంది సభ్యులకు రూ. లక్ష చొప్పున సీడ్ క్యాపిటల్ అందిస్తామని హామీ ఇచ్చారు. నిరుపేదలకు, వృద్ధులు, వితంతువులకు, గీత కార్మికులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలకు ఇప్పుడు ఇస్తున్న రూ. 1000 పెన్షన్ ను రూ. 2 వేలకు పెంచుతామని, వికలాంగులకు రూ. 1,500గా ఉన్న పెన్షన్ ను రూ. 3 వేలకు పెంచుతామని ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
ప్రస్తుతం 65 ఏళ్లు దాటితేనే పెన్షన్ ఇస్తున్నారని, దీన్ని 58 సంవత్సరాలకు తగ్గిస్తామని అన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు వ్యతిరేకులని భావిస్తున్న 25 లక్షల మంది ఓట్లను గల్లంతు చేశారని, ఆ ఓట్లన్నీ తిరిగి చేర్చిన తరువాతనే ఎన్నికలు జరిపించాలని డిమాండ్ చేశారు. అమర వీరుల ఆత్మలు ఘోషించేలా కేసీఆర్ పాలన సాగుతోందని, ప్రజలు కేసీఆర్ ను తరిమికొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు.
Tags:KCR does not like to officially organize the ransom

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *