ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ కలలు

KCR dreams for the Federal Front

KCR dreams for the Federal Front

Date:14/01/2019
లక్నో ముచ్చట్లు:
బిజెపి, కాంగ్రెస్ లేని ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ కలలు కనడం తెలిసిందే. అయితే ఈ రెండిటిలో ఎవరో ఒకరి సపోర్ట్ లేకుండా కేంద్రంలో చక్రం తిప్పడం అసాధ్యమన్నది చంద్రబాబు ఆలోచన. తెలుగు రాష్ట్రాల ఇద్దరు ముఖ్యమంత్రులు జాతీయ రాజకీయాల్లో భిన్నమైన మార్గాల్లో ప్రయాణిస్తున్నారు. చంద్రబాబు కాంగ్రెస్ తో జట్టు కడితే కెసిఆర్ మాత్రం ప్రాంతీయ పార్టీలతో కూటమికి నడుం కట్టారు. టి సీఎం ధోరణిపై చంద్రబాబు ఇటీవలే నిప్పులు చెరిగారు. ఆయన ఒక్కరే ఒంటరి అవుతారంటూ ఇటీవలే వ్యాఖ్యలు సైతం చేశారు. ప్రధాని మోడీ సైతం ఫెడరల్ కూటమి నా అదెక్కడా అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు కూడా. యుపి, బీహార్ వంటి, బెంగాల్ వంటి ఎక్కువ పార్లమెంట్ స్థానాలు వున్న చోట్ల కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతే ఆ పార్టీ రాబోయే ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడం మాట అలా ఉంచితే థర్డ్ ఫ్రంట్ ను కూడా శాసించే పరిస్థితి ఉంటుందా ఉండదా అన్నది వచ్చే ఎన్నికల ఫలితాలు తేల్చనున్నాయి.
మొన్నటి ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో భారీ విజయం ఏమి కాంగ్రెస్ ను వరించలేదు. బిజెపి దగ్గర దగ్గరగా ఈ రాష్ట్రాల్లో అధికారానికి చేరువ అయ్యేన్ని సీట్లు సాధించింది. దాంతో కమలం పార్టీ తిరిగి అధికారం దక్కించుకోదన్న గ్యారంటీ ఏమి లేదని తేలిపోతుంది. అయితే గతం లోలా బిజెపి పూర్తి మెజారిటీ తో సీట్లు దక్కించుకోకపోయినా సింగల్ లార్జెస్ట్ పార్టీ గా అవతరించడం యుపి పరిణామాలు గమనిస్తే తేటతెల్లం అవుతుంది.మొదటిసారి కెసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాలు ఆశించినంత ఫలించలేదు. కానీ రెండోసారి ముఖ్యమంత్రి అయినవెంటనే ఆయన ప్రాంతీయ పార్టీల అధినేతలను మరోసారి చుట్టి వచ్చారు. దాంతో ఒక్కొక్కరుగా కాంగ్రెస్ ను వదిలించుకుని తమ రూటే సపరేట్ అంటున్నారు. ముందుగా మమతా బెనర్జీ రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా కూటమి తరపున అంగీకరించేది లేదని తెగేసి చెప్పారు.
ఆమె బాటలోనే మాయావతి, అఖిలేష్ లు జట్టు కట్టి మరీ కాంగ్రెస్ ను ఒంటరి చేసేసారు. పైగా రాయబరేలి, అమెధీలో తమ కూటమి పోటీ చేయబోవడం లేదంటూ బిక్ష మేసినట్లు సోనియా రాహుల్ లకు రెండు సీట్లు పడేయడం చర్చనీయాంశం అయ్యింది.కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు టిడిపి, డిఎంకె, జెడిఎస్ ఖచ్చితంగా వెంటవచ్చే పార్టీలుగా వున్నాయి. మిగిలిన పార్టీలు కాంగ్రెస్ తో స్నేహపూర్వక పోటీ అని కూడా అనడం లేదు సరికదా దేశానికి ద్రోహం చేసింది అన్యాయం అవినీతికి ఆద్యం పోసింది హస్తమే అనే స్లోగన్ తెరపైకి తెచ్చాయి.
అంతేకాదు బిజెపి ని ప్రధాన శత్రువుగా రెండవ శత్రువు కాంగ్రెస్ అన్న రీతిలో వచ్చే పార్లమెంట్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు సన్నద్ధం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తో జట్టు కట్టి ఎపి లో ఎన్నికలకు వెళ్లనున్న చంద్రబాబు కేంద్రంలో కాంగ్రెస్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని ధీమాగా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఒక వేళ ప్రజలను ఆయన నమ్మించే ప్రయత్నం చేద్దామన్నా అతిపెద్ద రాష్ట్రం యుపిలో జీరో స్థితికి వెళ్లేలా చేశారు మాయ, అఖిలేష్ లు. దేశం కోసం, ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి ఇదంతా చేస్తున్నామని చంద్రబాబు స్లోగన్ కాపీ కొట్టేశారు యుపి విపక్ష నేతలు. ఇది దేశ రాజకీయాలపై అవగాహన వున్న ఏ చిన్నవారికైనా అర్ధం అయిపోయేలా మారింది.
Tags:KCR dreams for the Federal Front

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *