కాంగ్రెస్ కు కేసీఆర్ ఎఫెక్ట్

KCR Effect for Congress

KCR Effect for Congress

Date:14/04/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ సీఎం కేసీఆర్ కర్ణాటక వెళ్లడం వెనుక వ్యూహమేంటి .. ? ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతు కోరడానికేనా.. మరేదైనా మర్మం ఉందా.. ?  కర్ణాటక ఎన్నికల వేళ అంత హడావుడిగా కేసీఆర్ బెంగళూరు  ఎందుకు వెళ్లినట్టు ..? తెలుగువాళ్లు జేడీయూకి ఓటు వేయాలంటూ కేసీఆర్  చెప్పడం వెనుక ఆంతర్యమేంటి.. ? దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా వివిధ పార్టీల నేతలతో కేసీఆర్ భేటీ అవుతున్నారు. ఇప్పటికే బెంగాల్ సీఎం మమతా బెనర్జిని కలిసొచ్చిన.. సీఎం కేసీఆర్ ఆ తర్వాత  కొంత కాలం స్తబ్దుగా ఉన్నారు.  ఇప్పుడు ఫ్రెడరల్ ఫ్రంట్ కోసమంటూ కొందరు నేతలను కలిసే పని పెట్టుకున్నారు.. కేసీఆర్ . అందులో భాగంగా  ముందుగా  కర్ణాటక జేడీయూ వ్యవస్థాపకుడు మాజీ ప్రధాని దేవెగౌడతో భేటీ అయ్యారు. ఫ్రెడరల్ ఫ్రంట్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. పనిలో పనిగా .. తెలుగువాళ్లు జేడీయూకు మద్దతు ఇవ్వాలంటూ రిక్వెస్ట్ కూడా పెట్టేశారుఅంతవరకు బాగానే ఉన్నా..కేసీఆర్ ఇంత అర్జెంట్‌గా బెంగళూరు ఎందుకు వెళ్లినట్టు..? జేడీయూనేతలనే ఎందుకు కలిసినట్టు.. ? జేడీయూ నేతలతో కేసీఆర్ భేటీ కావడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్టు కనిపిస్తోంది. కర్ణాటకలో జేడీయూ కింగ్ మేకర్ కానుందని.. కేసీఆర్ ముందే పసిగట్టారా .. ? అందుకే ముందుగా వెళ్లి కలిసొచ్చారా.. ? అంటే అవుననే అంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు  కేసీఆర్.. దేవెగౌడను అలా కలిసొచ్చారో లేదో… ? ఓ నేషనల్ ఛానల్ … కర్ణాటక ఒపినీయన్ పోల్స్ వెల్లడించింది. అందులో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించనుందని ఆ ఛానల్ ఒపినీయన్ పోల్ లో వెల్లడింది. అయితే ఆ పార్టీ అధికారానికి  కావాల్సిన సీట్లు మాత్రం సాధించలేకపోతుందని స్పష్టం చేసింది. అలా చూస్తే ..34 నుంచి 43 సీట్లు గెలుచుకోనున్న  జేడీయూ కింగ్ మేకర్ అయ్యే  ఛాన్స్ ఉంది.ఆ విషయాన్ని రాజకీయ చాణిక్యుడు కేసీఆర్ ముందుగానే పసిగట్టారని … రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీ అంటీముట్టనట్టు వ్యవహరిస్తూ…. కమలానికి పరోక్షంగా సాయం చేస్తున్నట్టు కనిపిస్తున్నారు.. కేసీఆర్ . పార్లమెంట్ లో ప్రత్యేక హోదా విషయంలోనూ.. దక్షిణాది రాష్ట్రాల ఆర్థిక మంత్రుల సమావేశంలో పాల్గొనకుండా.. తమ వైఖరెంటో చెప్పకనే చెప్పారు . ఇక  కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో  జేడీయూకు మద్దతు  తెలపడం ద్వారా  ఒక్క దెబ్బకి రెండు పిట్టలను కొట్టొచ్చన్న వ్యూహంగా కూడా కనిపిస్తోందంటున్నారు.. పొలిటికల్ ఎనలిస్టులు.  తెలంగాణలో టీఆర్ఎస్  ప్రధాన శత్రువు .. కాంగ్రెస్.  కర్ణాటకలో హస్తం హవా కొనసాగి అధికారంలోకి వస్తే ..తెలంగాణ కాంగ్రెస్‌కి నైతిక బలాన్ని ఇస్తుంది. ఇది ఒకింత టీఆర్ఎస్‌కి ఇబ్బందే . అందుకే కేసీఆర్  తన రాజకీయ చతురతతో జేడీయూకి మద్దతు ప్రకటించారు. తెలుగువాళ్లు కూడా మద్దతు ఇవ్వాలని కోరారు.  జేడీయూ బలపడి.. ఎక్కువ సీట్లు సాధిస్తే .. అది పరోక్షంగా బీజేపీకి  హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. తద్వారా కర్ణాటకలో కాంగ్రెస్‌ని దెబ్బకొట్టొచ్చున్నది కేసీఆర్ వ్యూహం అంటున్నారు.. పొలిటికల్ ఎనలిస్టులు .
Tags:KCR Effect for Congress

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *