ఓటు హక్కు వినియోగించుకున్న కేసీఆర్
హైదరాబాద్ ముచ్చట్లు:
రాష్ట్ర అసెంబ్లీ కమిటీ హాల్‌లో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. సోమవారం మధ్యాహ్నం సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కేసీఆర్‌తో పాటు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు ప్రశాంత్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఓటు వేశారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటి వరకు 116 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. ఇంకా మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ఈ నెల 21న ఎన్నిక ఫలితాలను ప్రకటిస్తారు.
ఓటు వేసిన కేటీఆర్
: రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. శాసనసభ కమిటీ హాలులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో మంత్రి కేటీఆర్ మొదటి ఓటుహక్కు వినియోగించుకున్నారు. అనంతరం మంత్రులు, ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఓటు వేస్తున్నారు. అంతకుముందు తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మాక్ పోలింగ్‌కు మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అనంతరం అక్కడి నుంచి బస్సుల్లో నేరుగా అసెంబ్లీకి చేరుకున్నారు.విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్మా, బీజేపీ అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఎన్నికల భరిలో ఉన్నారు.

Tags: KCR exercised his right to vote
