నల్గోండ జిల్లా పట్టు కోసం కేసీఆర్ పదవ్యూహాం

KCR for review of Nalgonda district grip

KCR for review of Nalgonda district grip

 Date:15/09/2018
నల్గొండ ముచ్చట్లు:
ముందస్తు ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతోంది. ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీకి బలమైన నేతలుగా ఉన్నవారిని గులాబీ బాస్ కేసీఆర్ టార్గెట్ చేస్తున్నారు. గత ఎన్నికల అనుభవంతో ఈసారి పక్కాగా ప్లాన్ ఫిక్స్ చేస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రమంతటా టీఆర్ఎస్ హవా సాగినా గత ఎన్నికల్లో నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుకుంది.
నల్గొండ జిల్లాలో ఆరు అసెంబ్లీ సీట్లతో పాటు నల్గొండ పార్లమెంట్ స్థానాన్ని భారీ మెజారిటీతో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తర్వాత జరిగిన జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రస్థాయి నేతలుగా ఉన్న కుందూరు జానారెడ్డి, కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్ నల్గొండ జిల్లాకు చెందిన వారే కావడం, క్షేత్రస్థాయిలో క్యాడర్, ఓటు బ్యాంకు బలంగా ఉండటం గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి కలిసివచ్చింది.
అయితే, గత ఎన్నికల్లా కాకుండా ఈసారి బలంగా ఉన్న జిల్లాలోనే కాంగ్రెస్ ను దెబ్బ కొట్టాలని కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారు. ఉత్తమ్ సతీమణి పద్మావతిరెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న కోదాడపైనా టీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇక్కడ రెండుసార్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిథ్యం వహించినందున వారి కుటుంబానికి మంచి పట్టు ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన బొల్లం మల్లయ్య యాదవ్ కూడా గట్టిపోటీ ఇచ్చి రెండోస్థానంలో నిలిచారు.
పొత్తు కారణంగా ఈ స్థానం కోసం టీడీపీ పట్టుబట్టే అవకాశం ఉంది. రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తున్నందున గత ఎన్నికల్లో కంటే బలంగా కనపడుతోంది. అందుకే, ఇంకా ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థిని ఫైనల్ చేయలేదు. నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి అయితే ఇక్కడ కూటమికి గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్నారు. మొత్తానికి నల్గొండలో కాంగ్రెస్ కంచుకోటలను బద్దలుకొడతామంటున్న టీఆర్ఎస్ ఇందు కోసం బాగానే వ్యూహాలు రచిస్తున్నట్లు కనపడుతోంది.కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని, ఆయన భార్యను ఎలాగైనా ఓడించి నైతికంగా దెబ్బ కొట్టేందుకు టీఆర్ఎస్ వ్యూహాలు పన్నుతోంది.
ఎన్నికల్లో గట్టి పోటీ ఉంటే ఉత్తమ్ కుమార్ రెడ్డిని రాష్ట్రం మొత్తం తిరగకుండా ఆయన, ఆయన భార్య పద్మావతిరెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న హుజుర్ నగర్, కోదాడ నియోజకవర్గాలకు పరిమితం చేయాలనేది టీఆర్ఎస్ ప్లాన్. అసెంబ్లీ రద్దు చేసిన రోజునే 105 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ ఈ రెండు నియోజకవర్గాలకు మాత్రం ప్రకటించలేదు. గత ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిపైన ప్రత్యేక తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను నిలబెట్టారు. ఆమెపై ఉత్తమ్ సుమారు 23 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
ఇక కోదాడలో పద్మావతిపైన టీఆర్ఎస్ నుంచి శశిధర్ రెడ్డికి టిక్కెట్ ఇవ్వగా ఆయన మూడో స్థానానికి మాత్రమే పరిమితమయ్యారు. అయితే, బలమైన ప్రత్యర్థులు లేనందున ఉత్తమ్ దంపతులు గత ఎన్నికల్లో సులువుగా విజయం సాధించారనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరిపై ఈసారి బలమైన అభ్యర్థుల కోసం అన్వేషిస్తున్నారు.హుజుర్ నగర్ విషయానికి వస్తే 2009, 2014లో ఉత్తమ్ ఇక్కడి నుంచి విజయం సాధించారు. మంత్రి పనిచేసిన సమయంలో నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశారనే పేరుంది. బలమైన క్యాడర్, ఓటు బ్యాంకు కూడా ఉంది.
గత ఎన్నికల్లో ఇక్కడ వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులకు కూడా తలా 25వేలకు పైగా ఓట్లు వచ్చాయి. ఇప్పుడు టీడీపీతో కలిసి కాంగ్రెస్ పోటీ చేయడం ఖాయంగా కనపడుతున్నందున టీడీపీ ఓటుబ్యాంకు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది. దీంతో శంకరమ్మను కాకుండా బలమైన అభ్యర్థి కోసం టీఆర్ఎస్ అన్వేషిస్తోంది. సైదిరెడ్డి అనే ఎన్ఆర్ఐ సేవా కార్యక్రమాలతో నియోజకవర్గంలో హల్ చల్ చేస్తున్నారు. కానీ, గులాబీ బాస్ దృష్టి మాత్రం పక్క జిల్లా నేతపై ఉన్నట్లు తెలుస్తోంది.
మొదట ఈ స్థానం నుంచి ఫిరాయింపు ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డిని బరిలో దింపాలని భావించినా ఆయన కోదాడ అయితే ఓకే అన్నారని తెలిసింది. దీంతో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని హుజుర్ నగర్ తీసుకురావాలని అనుకుంటున్నారట. గత ఎన్నికల సమయంలోనే రాజకీయాల్లోకి వచ్చిన పొంగులేటి పక్కా ప్రణాళిక, ఆర్థ బలంతో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఖమ్మం ఎంపీగా విజయం సాధించారు. పొంగులేటి అయితేనే ఉత్తమ్ కు గట్టి పోటీ ఇవ్వగలుగు తాడు అని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది.
Tags:KCR for review of Nalgonda district grip

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *