అభద్రతభావనలో కేసీఆర్

KCR in insecurities

KCR in insecurities

Date:08/10/2018
కరీంనగర్ ముచ్చట్లు:
ఈనెల 10 న బీజేపీ సమరభేరికి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చే అవకాశం ఉంది.  పాలమూరు సభ విజయవంతం అయింది.  ప్రగతి నివేదన సభ కు 4 లక్షల మంది రాక పోవడం ప్రభుత్వం ఫై ఉన్న వ్యతిరేకత కు నాంది పలికింది.  ముందస్తుకు ఎందుకు వెళ్తున్నారో కెసిఆర్  చెప్పక పోవడం అభద్రత భావమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు.
మంత్రలంతా నియోజక వర్గాలకే పరిమితం అయ్యారు.  సర్వే లన్నీ తెరాస ఓటమి తప్పదాని  తేలుస్తున్నాయి.  గ్రూప్ 4 పరిక్ష పత్రం అంత తప్పుల తడకలే.  తెరాస కు ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని అయన అన్నారు.  కాంగ్రెస్ ది మహా కూటమి కాదు. తెలంగాణ ద్రోహుల కూటమి. కోదండరాం తెలంగాణ ప్రజలకు సంజాయిషీ ఇవ్వాలి.
ద్రోహుల పార్టీ ల తో కలిసి ఎలా పోటీ చేయబోతున్నారో చెప్పాలని అన్నారు. మార్పు కోసం బీజేపీ, ఈ సారి బీజేపీ అంటూ ఒంటరిగా పోటీ చేస్తున్నాం.  అమిత్ షా సభ తరువాత 27,28 తేదిల్లో  హైదరాబాద్  లో యువ సమ్మేళనం నిర్వహిస్తున్నాం. ఆ సమావేశ లో అమిత్ షా పాల్గొంటారని అయన అన్నారు.  ప్రధాని మోడీ, యూపీ సీఎం ఆదిత్య నాధ్  ల తో పాటు కేంద్ర మంత్రులు కుడా  పాల్గొంటారని వెల్లడించారు.
Tags: KCR in insecurities

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *