కేసీఆర్ తో టచ్ లోనే వున్నా

KCR is still in touch with

KCR is still in touch with

Date:13/10/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించకుండా రోడ్డు షోలు చేస్తోంది. తమకు చెప్పకుండా అసెంబ్లీ ని రద్దు చేశారని డీకే అరుణ కోర్టు కెళ్లారని హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు.  అసెంబ్లీ రద్దు అధికారం కేబినెట్ కుందని మంత్రి పదవి వెలగబెట్టిన అరుణ కు తెలియదా అని ప్రశ్నించారు. కోర్టు సరయిన తీర్పే ఇచ్చింది. శశిధర్ రెడ్డి ఓటర్ లిస్ట్ బాగాలేదని కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. .చివరకు కోర్టు కూడా ఎన్నికల కమిషన్ అధికారాలను ప్రశ్నించలేదు. .దమ్ముంటే శశిధర్ మా తలసాని పై గెలవాలని అన్నారు. .రైతు బంధు పథకం పై కూడా కోర్టు కాంగ్రెస్ రెండు చెంపలు వాయించింది. .సాగునీటి ప్రాజెక్టులపై కూడా కాంగ్రెస్ నేతలు కోర్టులకు వెళ్లి అడ్డుపడుతున్నారని అన్నారు. కోదండరాం,  కమ్యూనిస్టు పార్టీ ల నేతలు కాంగ్రెస్ కు వత్తాసు పలుకుతున్నారు. చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ఆపాలని కేంద్రానికి లేఖ రాశారు.
అన్నిటికి కాంగ్రెస్ నేతలు కెసిఆర్ కు అడ్డుతగులుతున్నారని విమర్శించారు. బతుకమ్మ చీరలను ఆపిన కాంగ్రెస్ కు ప్రజలు ఓట్లు కూడా ఆపేస్తారు. .మేమే మళ్ళీ అధికారం లోకి వస్తాం .బతుకమ్మ చీరలను మేమే పంచుతాం. .కాంగ్రెస్ కు గెలిచే సత్తా లేదు కాబట్టే మహాకూటమి కడుతోందని అన్నారు. .కాంగ్రెస్ కు చాలా చోట్ల డిపాజిట్లు రావు. చంద్రబాబు పార్టీ కి తెలంగాణ లో ఉనికే లేదని అన్నారు. .బీహార్ నుంచి జార్ఖండ్ వేరుపడగానే లాలూ పార్టీ బీహార్ కే పరిమితమయింది. .చంద్రబాబు జోలికి మేము వెల్లకున్నా ఆయన మా జోలికి వస్తున్నారు. నేను ముషీరా బాద్ ప్రెస్ మీట్ లో మాట్లాడిన దానిపై రేవంత్ రాద్ధాంతం చేస్తున్నారు. నేను పొరపాటున గత ఎన్నికల సందర్భంగా ఐదు లక్షలో పది లక్షల రూపాయలో కెసిఆర్ ఇస్తారన్నారు అనే బదులు పది కోట్లు అన్నాను. .
దాన్ని మీడియా సవరించాలని అన్నారు. .గత ఎన్నికలకు సంబంధించిన విషయాన్ని చెబితే ఈ ఎన్నికలకు ముడి పెడుతున్నారు. రేవంత్ రెడ్డి చిల్లరగాడు.  సారి రేవంత్ కొడంగల్ లో ఓడిపోవడం ఖాయం. .రేవంత్ కొడంగల్ కు చేసింది ఏమీ లేదు. రేవంత్ కు చంద్రబాబు తో చుట్టరికం ఇంకా పోలేదని అన్నారు. రేవంత్ లాంటి వ్యక్తిని ప్రోత్సహిస్తే అది కాంగ్రెస్ కే నష్టం. రేవంత్ కెసిఆర్ ను ఎంత తిడితే అన్ని ఓట్లు కాంగ్రెస్ నుంచి దూరమవుతాయని అన్నారు. ఉత్తమ్ అధికారం లోకి వస్తే అంతు చూస్తామని అధికారులను బెదిరిస్తున్నారు. .అధికారులు కాంగ్రెస్ ,టీడీపీ హాయం లో పని చేసిన వారే. ఎక్కడ్నుంచో రాలేదని అన్నారు. కాంగ్రెస్ అధికారం లోకి వస్తుందని ఉత్తమ్ పగటి కలలు కంటున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం పెరగాల్సిందే కానీ అధికారం రాదని అన్నారు.  .ఇక ఉత్తమ్ ను గడ్డం కుమార్ రెడ్డి అని పిలవాల్సిందే. .అన్నీ సర్వేలు తెరాస కే అనుకూలంగా ఉన్నాయి. ..మా సంక్షేమ పథకాలే పార్టీకి   వంద సీట్లు తెచ్చిపెడతాయి. కెసిఆర్ పథకాలు దేశం లో అందరికీ ఆదర్శమయ్యాయి.
కాంగ్రెస్ నేతలు జీరోలు కాబట్టే trs ప్రభుత్వం ఏమీ చేయలేదంటున్నారు. మేము హీరోలం. మళ్ళీ అధికారం మాదే. .కాంగ్రెస్ లో చేరాల్సిన ఖర్మ నాకు పట్టలేదని అన్నారు. నా రాజకీయ జీవితం మొత్తం కాంగ్రెస్ కు వ్యతిరేకమే. దిక్కు మాలిన వాళ్లే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు. కెసిఆర్ ఆదేశాలనే నేను శిరసా వహిస్తానని అన్నారు. .ముషీరా బాద్ నుంచి నా అల్లుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసే ప్రసక్తే లేదు. మాకు టికెట్ ఇవ్వకుంటే కెసిఆర్ దగ్గర మరో ప్రత్యామ్నాయం ఉండే ఉంటుంది. కాంగ్రెస్ లోకి మారుతున్నామని ప్రచారం చేసిన ఓ మీడియా సంస్థ ఫై మా అల్లుడు పరువు నష్టం దావా వేస్తున్నారు. .సీఎం కెసిఆర్ నాకు అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదు అనేది నిజం కాదు. కెసిఆర్ తో ఫోన్ లో టచ్ లోనే ఉన్నానని అన్నారు.
Tags:KCR is still in touch with

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *