కేసీఆర్‌ను దేశంలోని సీఎంల అందరిలో అధముడు

KCR is the chief of all CMs in the country

KCR is the chief of all CMs in the country

Date:06/10/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఎన్నికల తేదీ ప్రకటనకు ముందే తెలంగాణలో వాతావరణం వేడెక్కుతోంది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లక్ష్యంగా తీవ్ర స్థాయిలో కేసీఆర్ విమర్శలు గుప్పిస్తున్నారు. నిజామాబాద్, నల్గొండ, వనపర్తిల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన బాబును టార్గెట్ చేసుకున్నారు. దీనికి బదులుగా..
కాంగ్రెస్ పార్టీ నేత రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. శనివారం మధ్యాహ్నం మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌ను దేశంలోని సీఎంల అందరిలో అధముడంటూ విమర్శించారు. తెలంగాణలో పోరు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉంటుందని ఆయన తెలిపారు. ‘నాలుగన్నరేళ్లలో రాష్ట్రానికి ఏమీ చేయలేదు కాబట్టే.
 ప్రజలు ప్రశ్నిస్తారనే భయంతోనే బాబును టార్గెట్ చేస్తున్నారు. పోటీ బాబు వర్సెస్ కేసీఆర్ అని చిత్రీకరిస్తున్నారు. తద్వారా లాభం పొందాలనేది కేసీఆర్ వ్యూహం. చంద్రబాబు ఇలాంటి ఉడత ఊపులు ఎన్ని చూసి ఉంటాడు. ఓటుకు నోటు కేసులో కేసీఆర్ చంద్రబాబును ఏం చేసుకుంటాడో చేసుకొమ్మనండి. ముందు నన్ను దాటాకే కదా అమరావతికి వెళ్లేది. మూడ్రోజులు ఇంట్లో ఐటీ దాడులు చేసి ఏం సాధించారు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేదు కదా’ అని రేవంత్ ఎద్దేవా చేశారు. టీడీపీ, కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే.
నష్టం ఏంటని రేవంత్ నిలదీశారు. ‘టీడీపీ తరఫున బరిలో నిలిచేది తెలంగాణ నాయకులే కదా. చంద్రబాబుకు, లోకేశ్‌కు ఈ రాష్ట్రంలో ఓటు కూడా లేదు. అలాంటిది చంద్రబాబు గురించి అక్కసుతో మాట్లాడటానికి కారణం.. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టాలని అనుకోవడమే. ఇది కేసీఆర్ రాజకీయ ఎత్తుగడ. చంద్రబాబుకు తెలంగాణతో సంబంధం లేదు. కానీ టీడీపీతో సంబంధం ఉంది, ఉంటుంది. ఆ పార్టీ పుట్టిందే హైదరాబాద్ గడ్డ మీద’ అని రేవంత్ వ్యాఖ్యానించారు.
Tags: KCR is the chief of all CMs in the country

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *