కేసీఆర్, జగన్ కీలకం కానున్నారా

KCR, Jagan is crucial

KCR, Jagan is crucial

Date:30/04/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
తొలి మూడు దశలు ఎన్నికలు పూర్తయ్యాయి. దాదాపు దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నిక దాదాపు పూర్తయింది. అయితే ప్రాధమికంగా వస్తున్న సమాచారం ప్రకారం ఈ మూడు దశల్లో జరిగిన ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే హవా ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. ఒడిశాలో బిజూ జనతాదళ్, తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తమిళనాడులో డీఎంకే వంటి పార్టీలు అధికంగా పార్లమెంటు స్థానాలు దక్కించుకునే అవకాశాలున్నాయి. తొలి మూడు దశల ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలిస్తే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఒంటరిగా మ్యాజిక్ ఫిగర్ ను చేరుకునే అవకాశంలేదన్నది విశ్లేషకుల అంచనా.అందుకే ఎన్నికల తర్వాత ప్రాంతీయ పార్టీలదే పెత్తనమవుతుందని రాజకీయ విశ్లేషకులు సయితం అంగీకరిస్తున్నారు. మూడు దశలుగా జరిగిన ఎన్నికల్లో దాదాపు 302 స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నియోజకవర్గాల్లో ఎన్డీఏకు 80 స్థానాలకు మించి రావని లెక్కలు వేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ కూటమికి వంద స్థానాలకు మించి రావని చెబుతున్నారు. మిగిలిన 241 పార్లమెంటు స్థానాల్లో ఉత్తర భారతంలోనే ఉన్నాయి. వీటిలో ఎవరు ఎక్కువ స్థానాలు సంపాదించుకుంటే వారికే ఢిల్లీ పీఠం దక్కుతుంది. అయితే ఉత్తర భారతంలోనూ ఈసారి ఏ పార్టీకి తాము ఊహించుకున్నంత మెజారిటీ స్థానాలు రావన్నది అంచనాగా విన్పిస్తుంది.
దక్షిణ భారతదేశంలోని ప్రాంతీయ పార్టీలదే వచ్చే కేంద్ర ప్రభుత్వంలో కీలక భూమిక పోషించే అవకాశముంది. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సయితం అదే పనిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలదే కీరోల్ అని భావించిన కె.చంద్రశేఖర్ రావు తాను ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్ కు మరోసారి బలం చేకూర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయన త్వరలోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని స్వయంగా కలవనున్నారు. అలాగే ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, డీఎంకే అధినేత స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామిలను కలవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ప్రాంతీయ పార్టీలన్నీ కలసి ఒక ఉమ్మడి అజెండాను రూపొందించాలన్న లక్ష్యంతో కేసీఆర్ ఉన్నారు. దేశ ప్రయోజనాలు, అవసరాలతో పాటుగా రాష్ట్రాల ప్రయోజనాలను కలిపి అజెండాను రూపొందించాలని నిర్ణయించారు.
ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి, ఒడిశా నుంచి నవీన్ పట్నాయక్ లు కేసీఆర్ ప్రతిపాదనకు ఒకే చెప్పే అవకాశముంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా సాధనకు జగన్ కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు మద్దతిస్తారన్నది వాస్తవం. రెండు తెలుగురాష్ట్రాల్లో టీఆర్ఎస్, వైసీపీకి కలపి కనీసం 35 స్థానాలను సంపాదిస్తామన్న ఆశ ఉండటంతో జాతీయ స్థాయిలో తమ డిమాండ్లకు మద్దతిచ్చే పార్టీవైపే వీరు మొగ్గు చూపే అవకాశముందంటున్నారు. పేరుకు ఫెడరల్ ఫ్రంట్ అయినప్పటికీ ఏదో ఒక జాతీయ పార్టీకి మద్దతిచ్చే అవకాశముంది. జగన్, కేసీఆర్ లకు ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ మాత్రమే కావడంతో హంగ్ పార్లమెంటు ఏర్పడితే తమ కోర్కెలకు ఓకే చెబితేనే కమలం పార్టీకి మద్దతిచ్చే అవకాశాలున్నాయన్నది సుస్పష్టం.
Tags: KCR, Jagan is crucial

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *