ఆ ఐదుగురుతో  కేసీఆర్ కలుస్తారా.

Date:14/12/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. పౌరసత్వ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ చట్టాన్ని తాము అమలు చేయబోమని ఐదు రాష్ట్రాల సీఎంలు ప్రకటించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం అమరీంద్ సింగ్, కేరళ సీఎం పినరయి విజయన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ సీఎంలు ఈ చట్టాన్ని అమలు చేయబోమన్నారు. ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ సర్కారు కూడా అదే బాటలో నడిచే అవకాశం ఉంది.కాగా రాష్ట్రాలకు ఈ చట్టాన్ని వ్యతిరేకించే అధికారాలు లేవని కేంద్ర హోం శాఖ చెబుతోంది. పౌరసత్వ చట్టం అనేది కేంద్ర జాబితాలోని అంశమని చెబుతోంది.

 

 

 

 

 

ఇది రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలో ఉందని తెలిపింది. రక్షణ, విదేశీ వ్యవహారాలు, రైల్వేలు, పౌరసత్వం తదితర అంశాలు కేంద్ర జాబితాలోనివి అని హోం శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు.పార్లమెంట్‌లో పౌరసత్వ బిల్లుకు టీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటేసింది. ఈ నేపథ్యంలో పైన పేర్కొన్న ఐదు రాష్ట్రాల బాటలోనే కేసీఆర్ సర్కారు ప్రయాణించే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలంగాణలో పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేయబోమని గులాబీ బాస్ చెబుతారా? లేదంటే సైలెంట్‌గా ఉండిపోతారా? అనే అంశం ఆసక్తి రేపుతోంది.పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగ విరుద్ధమని.. భారత లౌకిక వాదానికి ఇది భంగం కలిగిస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ చట్టం ప్రకారం 2014 డిసెంబర్ 31కి ముందు.. పాకిస్థాన్, అప్ఘానిస్థాన్, బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి శరణార్థులుగా వచ్చిన హిందువులు, క్రిస్టియన్లు, బౌద్దులు, జైనులు, పార్శీలు, సిక్కులకు భారత పౌరసత్వం కల్పిస్తారు.

ఐపీఎల్ వేలంలో 15 ఏళ్ల చిచ్చరపిడుగు

Tags: KCR meet with those five.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *