తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కెసిఆర్ పాలన

-బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

 

హైదరాబాద్  ముచ్చట్లు :

తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు విరుద్ధంగా కెసిఆర్ పాలన సాగుతుందని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.తెలంగాణ అవతరణ దినోత్సవ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జెండా ఆవిష్కరణ వేడుకల్లో పాల్గొని ప్రసంగించారు.అమర వీరుల బలిదానాలు, ఉద్యోగులు, విద్యార్థుల త్యాగాల తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని,తెలంగాణను వ్యతిరేకించిన వారే నేడు కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్నారని అన్నారు.ఉద్యమకారులను పక్కనపెట్టి కెసిఆర్ ని తిట్టిన వారిని పక్కన పెట్టుకొని పాలన సాగిస్తున్నాడని దుయ్యబట్టారు.కెసిఆర్ కుటుంబ అభివృద్ధి కోసమే తెలంగాణ ఏర్పడింది అనే విధంగా కెసిఆర్ పాలన సాగుతోందని విమర్శించారు.ఓట్ల కోసం… అధికారం కోసమే కెసిఆర్ పాలన సాగుతోందని,ప్రజలు, విద్యార్థుల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రభుత్వం చేసిందేమిలేదన్నారు.ఉద్యమంలో పోరాటం చేసిన ఏ వర్గానికి కూడా కెసిఆర్ న్యాయం చేయలేదని,ఇందుకోసమేనా తెలంగాణ కోసం కొట్లాడింది అని ప్రతి ఒక్కరు మదనపడుతున్నారన్నారు.తెలంగాణలో ప్రజాస్వామ్య పాలన రావాలి… ప్రజల ఆకాంక్షల మేరకు పరిపాలన జరగాలన్నారు.అమరుల స్తూపం 2018 లో ప్రారంభమైన ఇప్పటి వరకు పూర్తి చేయలేదని,ఆనాడు యూపీఏ ప్రభుత్వం పార్లమెంట్ లో బిల్లు పెడితే బిజెపి మద్దతుతోనే తెలంగాణ ఏర్పడిందని కేసిఆర్ గుర్తుంచుకోవాలన్నారు.

 

వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంలో అభివృద్ధి , సంక్షేమం రెండుకళ్ళులాంటివి -మంత్రి పెద్దిరెడ్డి

 

Tags: KCR rule against the aspirations of the people of Telangana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *