మళ్లీపీకే కేసీఆర్ చర్చలు

హైదరాబాద్ ముచ్చట్లు:


తెలంగాణ రాజకీయాలు మళ్ళీ వేడెక్కాయి. ఇంతకుముందు వరంగల్ లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ పర్యటించారు. వరంగల్ డిక్లరేషన్ అంటూ సమరానికి సై అన్నారు. తాజాగా బీజేపీ నేత, బాద్ షా అమిత్‌ షా తెలంగాణలో పర్యటించారు. బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరై సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. దీంతో వాతావరణం మరింత రసవత్తరంగా మారింది. ఈ నేపథ్యంలో మరోమారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణ సీఎం కేసీఆర్‌ తో భేటీ కానున్నారనే వార్తలు హాట్ టాపిక్ అవుతున్నాయి.ఇప్పటికే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప‌లుసార్లు స‌మావేశ‌మై రాజ‌కీయ అంశాల‌పై చ‌ర్చించిన విష‌యం తెలిసిందే. ఈ నెల 18న కేసీఆర్, ప్రశాంత్ కిశోర్ మ‌రోసారి భేటీ అవుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్లే అవ‌కాశం ఉంద‌ని ప్రచారం జ‌రుగుతోంది. దీంతో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణలో తాజా పరిస్థితులపై ప్రశాంత్ కిషోర్ ఫోకస్ పెట్టారు. తాను పరిశీలించిన అంశాలను, అనుసరించాల్సిన వ్యూహాల గురించి కేసీఆర్‌కు పీకే నివేదిక ఇస్తారని తెలుస్తోంది.తెలంగాణలో వివిధ జిల్లాల్లో పార్టీ పరిస్థితి కొంత ఆందోళనకరంగా వుందని, సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత వ్యక్తం అవుతోందని పీకే వివరించనున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ బ‌ల‌హీనంగా ఉన్న నియోజకవర్గాల వివరాలను కేసీఆర్ కు పీకే వివరించనున్నారు. . కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్ లో వీరు స‌మావేశం నిర్వహించే అవ‌కాశం ఉందని తెలుస్తోంది. అమిత్ షా, రాహుల్ గాంధీ పర్యటన అనంతరం పరిస్థితిని కూడా వీరు చర్చించే అవకాశం వుందని తెలుస్తోంది.

 

Tags: KCR talks again

Post Midle
Post Midle
Natyam ad