కేసీఆర్.. అదే స్పీచ్…సెంటిమెంట్ పండించే ప్రయత్నం

KCR ... the same speech ... Sentiment trying to grow

KCR ... the same speech ... Sentiment trying to grow

Date:06/10/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ వనపర్తిలోనూ సేమ్ స్పీచ్ ఇచ్చారు. బంగారు తెలంగాణ దిశగా.. తొలి నాలుగున్నరేళ్ల పాలనలో.. తాను సాధించిన ప్రగతిని .. అటు నిజామాబాద్ , నల్లగొండలోనూ చెప్పుకోలేదు.. ఇటు వనపర్తిలోనూ వినిపించలేదు. కానీ సెంటిమెంట్ మాత్రం పుష్కలంగా పండించారు. తెలంగాణకు పట్టిన చీడపురుగు గా కాంగ్రెస్‌ ను అభివర్ణించారు. కాంగ్రెస్‌ నేతలు తెలంగాణ ప్రయోజనాలను తాకట్టుపెట్టారని ఆరోపించారు.
కరువులు, వలసలు, పెండింగ్ ప్రాజెక్టులు ఇదీ కాంగ్రెస్‌ పాలన అని తేల్చి చప్పారు. ఆర్డీఎస్‌ కింద పాత ఆయకట్టుకు నీళ్లు తీసుకొని తీరుతామని ప్రకటించారు. ఈ నాలుగేళ్ల కాలంలో ఎందుకు తీసుకోలేదో మాత్రం చెప్పలేకపోయారు. రాయలసీమ నేతలు ఆర్టీఎస్‌ నీళ్లను దోచుకుంటే.. సుంకేశులను బాంబు పెట్టి లేపేస్తానని ఉద్యమ సమయంలోనే చెప్పానని గుర్తు చేశారు. కానీ తాను సీఎంగా నాలుగున్నరేళ్లు ఉండి.. మరోసారి ముఖ్యమంత్రి అవడానికి ఎన్నికల ప్రచారం చేస్తున్న విషయాన్ని మర్చిపోయారు.
పాలమూరులో 20 లక్షల ఎకరాలకు నీరు పారించే బాధ్యత నాదేనని కొత్తగా ప్రకటించారు. నాలుగేళ్లలో ఎన్ని ఎకరాలకు కొత్తగా నీరిచ్చారో చెప్పుకోలేకపోయారు.కాంగ్రెస్, టీడీపీ 60 ఏళ్ల పాలన.. మా నాలుగేళ్ల పాలన ఎలా ఉందని ప్రజలనుప్రశ్నించారు. తెలంగాణ వస్తే కరెంటు ఉండదని కిరణ్‌కుమార్ రెడ్డి శాపాలు పెట్టారని.. దాన్ని తలకిందులు చేస్తూ 24 గంటల కరెంటు ఇస్తున్నామన్నారు. ఎకరాకు రూ.8వేలు పెట్టుబడి సాయం ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేసుకున్నారు. మా సభల్లో పల్లీలు అమ్ముకునేంత మంది కూడా రాలేదు కాంగ్రెస్‌ సభలకు అని ఎద్దేవా చేశారు. నిన్న గద్వాల ప్రచారసభలో.. కాంగ్రెస్ నేతలు..
కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. దానికీ కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. చౌరస్తాలో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ నేతలు కత్తులు తిప్పారని విమర్శించారు. కత్తులు తిప్పాల్సిన చోట తిప్పలేదు..తిప్పకూడని చోట తిప్పారన్నారు. ముందు ముందు చెబుతా కాంగ్రెస్‌ వాళ్ల పని అని హెచ్చరించారు. మాజీ మంత్రి డీకే అరుణను ప్రత్యేకంగా హెచ్చరించారు కేసీఆర్. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు. కాస్కోండి నా కొడుకుల్లారా అని డీకే అరుణ అంటోంది.
ఇంటింటికీ తిరిగి డీకే అరుణ బండారం బయటపెడతామని హెచ్చరించారు.రాజశేఖర్ రెడ్డి అనే దుర్మార్గుడు.. ప్రాజెక్టులను పెండింగ్ పెట్టి పాలమూరును ఎండబెట్టారని ఆరోపించారు.వైఎస్‌ పోతిరెడ్డిపాడుకు నీటిని తరలిస్తే కాంగ్రెస్‌ నేతలు ఏం చేశారని ప్రశ్నించారు. పోతిరెడ్డిపాడును సమర్థిస్తూ చిన్నారెడ్డి పేపర్లలో వ్యాసాలు రాశాడన్నారు. చంద్రబాబుపైనా తన విమర్శల ఘాటును ఏ మాత్రం తగ్గించలేదు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఆంధ్రావాళ్లకు అప్పగిస్తామా? అని ప్ఱశ్నించారు. చంద్రబాబును ఎవరూ వేధించడంలేదన్నారు.
ఓటుకు నోటుకేసులో చంద్రబాబు వాయిస్‌ రికార్డు నిజంకాదా? అని ప్రశ్నించారు. తెలుగు వాళ్లమంటూనే మమ్మల్ని ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుపై శాపనార్థాలు పెట్టారు. చంద్రబాబుది ఐరన్‌ లెగ్‌.. ఎక్కడ కాలు పెడితే అక్కడ మాడిపోతుందన్నారు. మీ దమ్మెందో మా దమ్మేందో చూసుకుందాం రా అని సవాల్ చేశారు .
Tags; KCR … the same speech … Sentiment trying to grow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You may have missed