కళ్యాణానికి హాజరు కానున్న కేసీఆర్

Date:17/03/2018
ఖమ్మం ముచ్చట్లు:
భద్రాచలం పుణ్యక్షేత్రంలో సంప్రదాయబద్దంగా ప్రతీఏటా నిర్వహిస్తున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది కూడా కనుల పండువగా నిర్వహిద్దామని రాష్ట్ర రోడ్లు, భవనాలు, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. భద్రాచలం రామాలయం చిత్రకూట మండపంలో ఏర్పాటు చేసిన శ్రీరామనవమి సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. మార్చి 26న శ్రీసీతారాముల కల్యాణం, మార్చి 27న శ్రీరామపట్టాభిషేకం జరగనున్న నేపధ్యంలో ఈ మహోత్సవాలు వీక్షించడానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాల సమాచారాన్ని ప్రతీ ఒక్కరు తెలుసుకునే విధంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. స్వామివారి తలంబ్రాలు బస్సుల్లో పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలనితెలిపారు. లోక కల్యాణం ప్రశాంతంగా భక్తిభావంతో జరిగేందుకు ప్రతీ ఒక్కరు తమకు కేటాయించిన విధులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని పేర్కొన్నారు.శ్రీసీతారాముల కల్యాణానికి సీఎం కేసీఆర్, పట్టాభిషేకానికి గవర్నర్ నర్సింహన్‌లు వస్తున్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు తాత్కాలిక వసతి, మరుగుదొడ్ల సౌకర్యం ఏర్పాటు చేయాలని, వేసవిని దృష్టిలో పెట్టుకొని మజ్జిగ, వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.
Tags: KCR to be present for the wedding

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *