కేసీఆర్ కు దడ పుట్టింది

KCR was born

KCR was born

 Date:15/08/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ రెండురోజుల హైదరాబాద్ పర్యటన అద్భుతంగా సాగింది. ప్రజల నుంచి రాహుల్ టూర్ కు మంచి స్పందన వచ్చింది. రాహుల్ విశ్వసనీయతపై ప్రజలు ఎంతో నమ్మకాన్ని ప్రదర్శించారని టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం నాడు అయన మీడియతో మాట్లాడారు. రాహుల్ పర్యటన కేసీఆర్ లో దడ పుట్టించింది.
దేశంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ల రీడిజైన్స్ దోపిడీని రాహుల్ బాగా ఎండగట్టారు.మహిళా సంఘాల బకాయిలు వెంటనే 960 కోట్లు విడుదల చేయడమే ఇందుకు నిదర్శనం.మహిళా సంఘాలకు ఇచ్చిన ప్రతిహామీకి కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని అన్నారు. బూత్ స్థాయి కార్యకర్తలతో టేలికాన్ఫరేన్స్ రాహుల్ సంతృప్తి వ్యక్తం చేశారు. మరో సారి టేలీకాన్ఫరెన్స్ రాహుల్ తో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. సెటిలర్స్ కు ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో నెరవేరుస్తాం.
ఎల్బీనగర్ లో నిర్వహించిన నిరుద్యోగ సభ కు ఊహించిన దానికంటే ఎక్కువ జనం వచ్చారని అన్ఆరు. వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆసరా పెన్షన్స్ ను వెయ్యి నుంచి రెండువేలకు పెంచుతాం. పెన్షన్స్ వయస్సు అర్హత 60 నుంచి 58 ఏళ్లకు తగ్గిస్తాం. నిరుద్యోగ భృతి ఎలా ఇస్తారని కేసీఆర్ ప్రశ్నించడం సిగ్గుచేటు. ఎంప్లాయిమెంట్ లో రిజిష్టర్ అయ్యిన నిరుద్యోగులకు నెలకు మూడువేలు ఇచ్చి తీరుతామని అన్నారు.  ముందస్తు ఎన్నికలకు మేము సిద్ధంగా ఉన్నాం.
సెప్టెంబర్ లో అభ్యర్థులను ప్రకటిస్తాం. రాష్ట్రంలో పొత్తులపై పార్టీ లో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. కేటీఆర్ రాహుల్ పై చేసిన వ్యాఖ్యలు చిల్లర వ్యాఖ్యలని అయన విమర్శించారు. కేటీఆర్ రాహుల్ పై చేసిన వ్యాఖ్యలు చిన్న పిల్లవాడి మాట్లాడారు. రాష్ట్రాన్ని దోచుకునేందుకే తాము ఉన్నట్లు కేటీఆర్ వ్యవహారం ఉందని మండిపడ్డారు.
Tags:KCR was born

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *