Natyam ad

బీఆర్ఎస్ పేరుతో తన నెత్తిన తానే టోపీ పెట్టుకున్న కేసీఆర్..

విజయశాంతి ముచ్చట్లు:


హైదరాబాద్ జనవరి 13
ఇన్నాళ్లూ టీఆర్ఎస్ పేరుతో సీఎం కేసీఆర్.. జనాలకు టోపీ పెట్టారని, ప్రస్తుతం బీఆర్ఎస్ పేరుతో తన నెత్తిన తానే టోపీ పెట్టుకున్నారని.. బీజేపీ నేత విజయశాంతి అన్నారు. సోషల్ మీడియా వేదికగా ఆమె.. సీఎం కేసీఆర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అవి ఆమె మాటల్లోనే..‘‘నేడు బీఆరెస్, అంతకు ముందు టీఆరెస్… పేరు మార్పు తప్ప కేసీఆర్ గారి నాయకత్వంలోని ఆ పార్టీ పద్ధతులు, విధానాల్లో ఏ మార్పూ లేదనడానికి ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోయే పెద్ద ఉదాహరణ. బీఆరెస్ అధినేత కేసీఆర్ తమ పార్టీ నాయకులు ఏ మాత్రం ఎదగకుండా కట్టడి చేస్తూ వారిని కీలుబొమ్మల్లా తయారు చేస్తున్నరు. ఏ ఆత్మగౌరవం పేరిట తెలంగాణ కోసం కొట్లాడినమో… ఆ ఆత్మగౌరవం ఈ స్థాయికి అవమానించబడటం అన్యాయం, దుర్మార్గం, బాధాకరం కూడా కేసీఆర్ గారూ… మీరు మారరు. ప్రజలే మిమ్మల్ని మారుస్తరు, గద్దె దింపి ఎల్లగొడ్తరు. ఇక జనం నెత్తికి టీఆరెస్ పేరిట అసత్యాలతో అనునిత్యం టోపీ పెట్టే ఈ సీఎం గారు, గీ మధ్య బీఆరెస్ పెట్టి తన నెత్తికి తనే టోపీ పెట్టుక తిరుగుతున్నరు. బీఆరెస్ అంటే భస్మాసుర రాష్ట్ర సమితి అని కావచ్చు… ఈ స్వంత నెత్తికి కేసీఆర్  టోపీ సంకేతం’’.. అని విజయశాంతి పేర్కొన్నారు.

 

Tags; KCR wearing his own hat in the name of BRS..

Post Midle
Post Midle