ఓటమిని అంగీకరించిన కేసీఆర్‌: జీవన్‌రెడ్డి

KCR who is losing defeat: Jeevan Reddy

KCR who is losing defeat: Jeevan Reddy

Date:23/11/2018
జగిత్యాల ముచ్చట్లు:
తనకు ఎన్నికల్లో ఓట్లేస్తే అధికారంలో ఉంటా.. ఓడిపోతే ఫాంహౌజుకే పరిమితమవుతానని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొనడం ఆయన ముందస్తుగా తన ఓటమిని అంగీకరించారని  జగిత్యాల కాంగ్రెస్‌ అభ్యర్థి, ఆ పార్టీ సీనియర్‌ నేత జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాలలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టం తన సొంత ఆస్తిలా కేసీఆర్‌ భావిస్తున్నారని విమర్శించారు. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే కల్వకుంట్ల కుటుంబం అధికారం కోసం పడుతున్న తాపత్రయం కనిపిస్తోందని ఎద్దేవాచేశారు. ప్రతిపక్ష హోదాలో కొనసాగే మనోధైర్యం లేకే వైదొలగాలని చూస్తున్నారన్నారు. కొడుకు కేటీఆర్‌ సన్యాసం చేస్తామనడం.. తండ్రి కేసీఆర్‌ ఫాంహౌజ్‌కు పరిమితమవుతానని చెప్పడం బట్టి చూస్తుంటే.. ఓటమి భయంతోనే వారు అలా మాట్లాడుతున్నారని అర్థమవుతోందన్నారు.
Tags:KCR who is losing defeat: Jeevan Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *