రామగుండంలో పర్యటిస్తున్న కేసీఆర్ 

Failed Chief Minister Kesir Krishi

Failed Chief Minister Kesir Krishi

Date:18/05/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

ముఖ్యమంత్రి  పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో పర్యటిస్తున్నారు.హైదరాబాద్‌ నుంచి పెద్దపల్లి జిల్లాలోని రామగుండం చేరుకున్నారు.తర్వాత రామగుండం ఎన్టీపీసీని సీఎం కేసీఆర్‌ సందర్శించనున్నారు. అనంతరం ఎన్టీపీసీ, జెన్‌కో అధికారులతో కేసీఆర్‌ సమీక్ష సమావేశం నిర్వహించారు. రాత్రికి ఎన్టీపీసీలోని జ్యోతిభవన్‌లో కేసీఆర్‌ బస చేశారు. ఇక ఆదివారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దేవాలయాన్ని కేసీఆర్‌ సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న కన్నెపల్లి పంపు హౌస్‌, మేడిగడ్డ బరాజ్‌ పనులను కేసీఆర్‌ పరిశీలించనున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం లో భాగంగా తెలంగాణ కోసం రామగుండం ఎన్టీపీసీలో 1,600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ నిర్మిస్తుండగా, తొలి విడుతలో చేపట్టిన 800 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ పనులు శరవేగం గా జరుగుతున్నాయి. రూ.10,598.98 కోట్ల వ్యయంతో రామగుండం ఎన్టీపీసీలో తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను 2016 ఆగస్టులో ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. ఈ పవర్ స్టేషన్ కోసం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి రెండు టీఎంసీల నీటిని కేటాయించారు. ప్లాంట్ నిర్మాణం కోసం మే 2015లోనే ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేశారు. కాగా, దీనికి ఒడిశాలోని మందాకిని-బీ మైన్ నుంచి బొగ్గు సరఫరా చేస్తారు. తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ పర్యావరణ అనుమతులను కూడా సాధించగా, పనులు శరవేగంగా సాగుతున్నాయి.

మోడికి జగన్మాత ఆశీస్సుల కోసం  బిజెపి ‘రాజ శ్యామల మహా యాగం’

 

Tags; KCR who is visiting Ramagundam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *