కేబినెట్ లేకుండా కేసీఆర్….

KCR without cabinet ....
Date:11/02/2019
హైదరాబాద్ ముచ్చట్లు:
కేబినెట్ లేకుండా కేసీఆర్.. కొత్త సంప్రదాయం తెచ్చారని ఏఐసిసి కార్యదర్శి వీహెచ్ హనుమంత రావు ఎద్దేవా చేసారు.మూడునెలలు కావొస్తున్నా కేబినెట్ ఏర్పాటు చేయకపోవడం  దారుణమని విమర్శించరు.రాష్ట్రంలో ,ప్రభుత్వం ఉందొ ..లేదో అర్థం కావడం లేదన్నారు.ఆంధ్రలో అవినీతి అని చెబుతున్న మోడీకి తెలంగాణాలో ని అవినీతి ,కుటుంబపాలన కనిపించకా పోవడం శోచనీయమని ఏఐసిసి కార్యదర్శి వీహెచ్ హనుమంత రావు అన్నారు.సోమవారం గాంధీ భవన్ లో మీడియా సమావేశం లో మాట్లాడుతూ మోడీ .. కేసీఆర్ పై ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష రాహుల్ పాల్గొన్నందుకు ఏపీ హోదాపై ఏపీ ప్రజలు సంతోషపడుతున్నారన్నారు.తెలంగాణ కు విభజన హామీలను ఎందుకు అమలుచేయడంలేదో మోడీ చెప్పాలని డిమాండ్ చేసారు.రాహుల్ ప్రధాని ఐతేనే ఏపీకి హోదా ,తెలంగాణకు విభజన హామీలు అమలు అవుతాయి.ఖమ్మం ఎంపీకి దరఖాస్తు పెట్టుకున్నానని, హైకమాండ్ టికెట్ ఇస్తే ఖమ్మం ఎంపీగా గెలిచివస్తా నన్నారు.
Tags:KCR without cabinet ….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *