కేసీఆర్ ది నియంత పోకడ : రేవంత్ రెడ్డి

KCRR The Dinant Style: Revant Reddy

KCRR The Dinant Style: Revant Reddy

Date:11/10/2018
నిజామాబాద్  ముచ్చట్లు:
తెలంగాణ ఏర్పడ్డాక ఒక్క అవకాశం ఇస్తే తెలంగాణ ను బంగారు తెలంగాణ చేస్తాని కేసిఆర్ ప్రజలను మభ్యపెట్టి  మాయ చేసి అధికారం లోకి వచ్చారని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు.నిజామాబాద్ జిల్లా కేంద్రంలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. టిఆర్ ఎస్ పాలనలో ఆత్మహత్య లు తగ్గలేదని.ఎన్నికల హామీలేవి అమలు కాలేదని దుయ్యబట్టారు. రుణమాఫీ కాదు గిట్టుబాటు కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు.దనవంతులుగా,  ఆదర్శ రైతులుగా ఉన్న జిల్లా రైతులు ఆత్మహత్య లు చేసుకుంటున్నారు.పసుపు బోర్డు, సెజ్ హామీ ఎక్కడ పోయిందో చెప్పాలని డిమాండ్ చేసారు. టిఆర్ ఎస్ ప్రభుత్వం లక్ష్యసాధనలో మొదటి అడుగే వేయలేదని అర్దాంతరంగా ఎందుకు అసెంబ్లీని రద్దు చేశారో చెప్పాలని డిమాండ్ చేసారు.
భూములు గుంజుకున్నందుకు ప్రజలు కేసులేశారు. కేసిఆర్ ది  నియంత పోకడని ప్రగతిభవన్ లో పేద ప్రజలకు అమరవీరుల కుటుంబాలకు కూడా ప్రవేశం లేకుండా నిసేదం విదించారని అన్నారు.పైరవీకారులు,సినీ నటులకే ప్రగతిభవన్ ను పరిమితం చేశారని ఎద్దేవా చేసారు. సచివాలయానికి రాకుండా ప్రజలు చెప్పినది విననందున రెండు వందల మంది కేసిఆర్ ప్రభుత్వం పై కేసులు వేశారని రేవంత్ చెప్పారు.
ప్రజాస్వామ్యం పట్ల కేసిఆర్ కు చిత్రశుద్ది లేదని  తిరిగి అధికారం లోకి వస్తే మళ్లీ కేసులు వేస్తారు కదా.. అప్పుడు మల్లీ అసెంబ్లీ ని రద్దు చేసి ఆత్మహత్య చేసుకుంటారా అని ప్రశ్నించారు  న్యాయం కోసం న్యాయస్తానం తలుపుతడితే అసెంబ్లీని రద్దు చేస్తారా..నాలుగు కొట్ల ప్రజల పక్షాన వకాల్తా పుచ్చుకొని కాంగ్రెస్ ఎన్నికల బరిలో దిగుతుందన్నారు.కేసిఆర్ కుటుంబంలోని నలుగురు దోపిడీ దారులు ఒక వైపు నాలుగు కోట్ల ప్రజలు మరోవైపుగా కురుక్షేత్ర యుద్దం జరగబోతుందని రేవంత్ అన్నారు.ప్రజలు కాంగ్రెస్ ను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు.
Tags:KCRR The Dinant Style: Revant Reddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *