కేసీఆర్ జన్మదిన వేడుకల ఏర్పాట్లు

KCR's birthday arrangements

KCR's birthday arrangements

Date:15/02/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ఈ నెల 17 వ తేదీన  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం మంత్రి జలవిహార్ లో  ఏర్పాట్లు పరిశీలించారు.  ముఖ్యమంత్రి జన్మదినం సందర్భంగా భారీ కేక్ కట్టింగ్ తో పాటు రక్తదాన కార్యక్రమం, వికలాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ, మహిళ లకు చీరెల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు. ఆ రోజు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మ వారి ఆలయంలో  ఆయుష్ హోమం జరగనుంది. ఇందులో నిజామాబాద్ ఎంసీ  కల్వకుంట్ల కవిత పాల్గొంటారు. పది  గంటలకు బన్సీలాల్ పేట డివిజన్ చాచా నెహ్రూ నగర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ జరుపుతారు. పదకొండు  గంటలకు జలవిహార్ లో  ముఖ్యమంత్రి జన్మదిన కేక్ ను ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోమ్ మంత్రి నాయిని నర్సింహారెడ్డి,  అబ్కారీ  శాఖ మంత్రి పద్మారావు, మేయర్ బొంతు రాంమోహన్, ఇతర ప్రజాప్రతినిధులు  పాల్గొంటారు.  దివ్యాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ, రక్తదాన శిబిరాన్ని తెరాస  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంతోష్ ప్రారంభిస్తారని మంత్రి వెల్లడించారు.
Tags: KCR’s birthday arrangements

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *