Natyam ad

రామసముద్రంలో వైభవంగా కేదారేశ్వర స్వామి వ్రతం

రామసముద్రం ముచ్చట్లు:

మండలంలో సోమవారం దీపావళి పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో మహిళలు కేదారేశ్వరి నోములు నిర్వహించారు. మండల కేంద్రంలోని శ్రీ వాలిశ్వరస్వామి, దిగువ పేటలో వెలసివున్న శ్రీ చంద్రశేఖరస్వామి ఆలయం లో అమావాస్య గడియల్లో భక్తులు కేదారేశ్వర వ్రతాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో చేపట్టారు. వేదపండితులు నోముల వ్రతాన్ని చదివి వినిపించారు. పండుగ పురస్కరించుకుని గ్రామాలు బంధుమిత్రులతో కిటకిటలాడాయి. ఇళ్ల ముందు పిల్లలు, పెద్దలు టపాకాయలు పేలుస్తూ ఆనందంగా దీపావళి పండుగను జరుపుకున్నారు.

 

Post Midle

Tags: Kedareshwara Swami vratam in glory in Ramasamudra

Post Midle