వ్యక్తిగత పరిశుభ్రత పాటించండి

Keep personal hygiene

Keep personal hygiene

Date:19/09/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు పట్టణంలోని ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించి, ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలని వెహోబైల్‌ మలేరియా డెంగ్యూ క్లినిక్‌ ఆఫీసర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. బుధవారం ఎన్‌ఎస్‌.పేట పరిధిలో గంగమ్మగుడివీధి, మురిగిమఠంవీధి, రహమత్‌నగర్‌, జోగిండ్లు ప్రాంతాలలో మలేరియా , డెంగ్యూ వ్యాదుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్చతహై సేవలో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అలాగే నివాస గృహాల మధ్య దోమలు ప్రభలి ప్రజలు వ్యాదులకు గురికాకుండ తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. 278 గృహాలను సందర్శించి 42 దోమల లార్వాలు గల కంటైనర్లు (తొట్లు,డ్రమ్ములు)గుర్తించి మున్సిపల్‌ సిబ్బందిచే అబేటుతో పిచికారి చేయించామన్నారు.

 

ఈ కార్యక్రమంలో శానిటరి ఇన్‌స్పెక్టర్లు సురేంద్రబాబు, సప్ధర్‌, సభ్యులు అమరనాథ్‌, రవిచంద్రన్‌, రాజశేఖర్‌, ప్రసాద్‌రావు, దయాళన్‌, నాగార్జున, గజరాజ తదితరులు పాల్గొన్నారు.

ప్రతిభా అవార్డులకు విద్యార్థులు ఎంపిక

Tags; Keep personal hygiene

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *