Natyam ad

420 పనులు చేసే రామచంద్ర నోరు అదుపులో పెట్టుకో…జాగ్రత్త-వెంకటరెడ్డి యాదవ్‌ ఆగ్రహం

-మంత్రి కుటుంబాన్ని విమర్శించే అర్హత లేదు
– నీవు ఏ పరిశ్రమకు యజమాని.
– యాదవ్‌ ల అభివృద్ధికి ఏమి చేశావ్‌.
-టోకెన్లతో ఓటర్లను మోసగించావ్‌
-హైడ్రామాలతో పబ్లిసిటి ఆరాటం
-వ్యక్తిగత విమర్శలు చేస్తే ఊరుకుంటారా.
-కుల రాజకీయాలతో చిచ్చుపెట్టోద్దు
-ప్రజాసేవ ఇలా కాదు చేసేది

పుంగనూరు ముచ్చట్లు:

Post Midle

420 పనులు చేస్తూ మూడు నెలలకు , ఆరు నెలలకు రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి కులం పేరుతో చిచ్చుపెడుతున్న రామచంద్ర యాదవ్‌ నోరు అదుపులో పెట్టుకోకపోతే తగిన శాస్తీ చేస్తామని పీకెఎం ఉడా చైర్మన్‌ , యాదవ్‌ సంఘ నాయకుడు వెంకటరెడ్డి యాదవ్‌ హెచ్చరించారు. మంగళవారం మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, గాండ్ల సంఘ అధ్యక్షుడు జయకృష్ణ, మైనార్టీల సంఘ అధ్యక్షుడు అమ్ము, యాదవ్‌ సంఘ కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌ తో కలసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వెంకటరెడ్డి యాదవ్‌ మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకులు ఏకమై పుంగనూరు మాత్రమే అభివృద్ధి జరుగుతోందని విమర్శలు చేస్తున్నారని తెలిపారు. అలాంటి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వ్యక్తి గతంగా విమర్శిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయన అభిమానులు దాడి చేశారని తెలిపారు. రాజకీయాలలో వ్యక్తిగత విమర్శలు చేస్తూ, కులం పేరుతో రాజకీయాలు చేసే వారు కనుమరుగైపోతారని హెచ్చరించారు. బిసిలకు , ఎస్సీ, ఎస్టీ , మైనార్టీలకు అధిక ప్రాధాన్యత కల్పించిన మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శించే అర్హత, స్థాయి రామచంద్ర యాదవ్‌కు లేదని స్పష్టం చేశారు. రాజకీయాలలో అభివృద్ధి చెందాలంటే ప్రజల్లోకి వెళ్లి తమకంటే మిన్నగా అభివృద్ధి చేసి చూపించి ప్రజాభిమానం సంపాదించుకుని హీరోయిజం చూపించాలనుకుంటే పతనం తప్పదని హెచ్చరించారు. మంత్రిని, మంత్రి కుటుంబంపై ఎవరు వ్యక్తి గత విమర్శలు చేసినా తగిన గుణపాఠం నేర్పుతామని, చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఇకనైనా రెచ్చగొట్టే ప్రసంగాలు వదిలి ప్రజాసేవ చేసుకోవాలన్నారు. ఈసమావేశంలో కౌన్సిలర్లు నరసింహులు, జెపి.యాదవ్‌, కాళిదాసు, మైనార్టీ నాయకులు రేష్మా, ఇంతియాజ్‌ఖాన్‌, మహబూబ్‌బాషా, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ సిఆర్‌.లలిత, వైఎస్సార్‌సీపీ నాయకులు కిషోర్‌, రమణ, లక్ష్మణ్‌రాజు, పాల్గొన్నారు.

యాదవ్‌లకు ఏమి చేశావ్‌…?

రాష్ట్రంలో పార్టీ పెడతానని…యాదవ్‌లను అభివృద్ధి చేస్తానని ప్రగల్భాలు పలికి జనసేన పేరుతో పోటీలోకి వచ్చిన రామచంద్ర యాదవ్‌ యాదవ్‌లకు ఏమి చేశాడని వెంకటరెడ్డి యాదవ్‌ నిలధీశారు. కేవలం కులం అడ్డుపెట్టుకుని రాజకీయ లభ్ధి పొందాలంటే తాము సిద్దంగా లేమన్నారు. యాదవ్‌లకు కంటేపల్లెలో అన్యాయం జరిగితే నువ్వు ఏమి చేశావని నిలధీశారు. మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో యాదవ్‌లు సంతోషంగా ఉన్నారని తెలిపారు. ప్రశాంతంగా ఉన్న పుంగనూరులో కుల చిచ్చుపెడితే సహించేది లేదన్నారు.

మంత్రి పెద్దిరెడ్డితో బడుగుల అభివృద్ధి…

జిల్లాలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎంతో సహకారం అందిస్తూ రాజకీయ పదవులు అందించారని యాదవ్‌ సంఘ కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్‌ తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డిని విమర్శిస్తూ కులం పేరుతో కుక్కల్లా మరుగుతున్నా వారు ఎక్కడ , ఏ నాయకుడి వద్ద ఎలా లబ్ధిపొందారో దమ్ముంటే చెప్పాలని నిలధీశారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రాజ్యాంగంతో బిసిలు అభివృద్ధి చెందుతున్నారని రామచంద్ర యాదవ్‌ లాగా నీ ఇంటికొస్తా…నీ వెంట వస్తానని మోసగిస్తే తగిన గుణపాఠం నేర్పుతామని హెచ్చరించారు.

నువ్వు ఏపరిశ్రమకు యజమాని…

పత్రికల్లో పారిశ్రామికవేత్తగా రాయించుకునే రామచంద్ర యాదవ్‌కు ఎన్నిపరిశ్రమలు ఉన్నాయ్‌..? ఎన్ని పరిశ్రమలకు యజమానో తెలపాలని వెంకటరెడ్డి యాదవ్‌ నిలధీశారు. ఉద్యోగమేళా పేరుతో డ్రామాలు ఆడుతూ ఉద్యోగ మేళా అడ్డుకున్నారని ప్రకటనలు ఇస్తూ పత్రికల్లో ఉచిత పబ్లిసిటి పొందుతున్న రామచంద్ర యాదవ్‌ ఏఏ కంపెనీలలో ఎన్ని ఉద్యోగాలు ఇస్తాడో లిస్టు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

టోకెన్లతో ఓటర్లను మోసగించావ్‌…

ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతున్న ఎన్నికను అపహాస్యం చేస్తూ ఓటర్లకు టోకెన్లు పంపిణీ చేసి కేసుల్లో ఇరుక్కుని 420 పనులు చేసిన రామచంద్ర యాదవ్‌ను ప్రజలు నమ్మరని వెంకటరెడ్డి యాదవ్‌ స్పష్టం చేశారు. ఎలాగైనా ప్రజల దృష్టిలో పడేందుకు అక్రమ మార్గాలలో వెళ్లితే కష్టాలు తప్పవన్నారు. మంత్రి కుటుంబంపై ఆరోపణలు చేస్తూ మూడునెలలకు, ఆరు నెలలకు గెస్ట్గా వచ్చేవారికి ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు.

Tags: Keep the mouth of Ramachandra who does 420 tasks under control…Beware-Venkata Reddy Yadav’s anger

Post Midle