పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి
– కల్వచర్ల లో ‘డ్రై-డే’ పనులు
కమాన్ పూర్ ముచ్చట్లు
వ్యాధులు ధరి చేరకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే రోగాలు దరిచేరవని మండల పంచాయతీ అధికారి కాటం భాస్కర్ అన్నారు. కల్వచర్లలో డ్రై డే పను లు చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ గంట పద్మ వెంకట రమణా రెడ్డి తో పాటు వీధుల్లో తిరుగుతూ పరిసరాల శుభ్రత, నీటి నిల్వల తొలిగింపుపై ప్రజలకు అవగాహన కల్పించారు. వర్షాలు కురుస్తుండడంతో నీరు నిల్వ ఉంటుందని దాంట్లో దోమలు వృద్ధి చెందుతాయన్నారు. దోమ కాటుతో డెంగ్యూ, మలేరియా, మెదడు వాపు వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయని వివరించారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల శుభ్రత పాటించాలని సూచించారు. దోమలు కుట్టకుం డా జాగ్రత్త పడాలన్నారు.నీటిని నిల్వలతో వ్యాధులు సోకే ప్రమాదం ఉందని, తాగునీటిని వేడి చేసుకొని చల్లార్చి తాగాలని సూచించారు. ఇంట్లోనే చెత్తను తడి, పొడి చెత్తగా వేరు చేసి పం చాయతీ సిబ్బందికి అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంట పద్మ వెంకట రమణా రెడ్డి, ఎంపిటిసి కొట్టే సందీప్, ఉపసర్పంచ్ వేము వేము కనుకయ్య పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, ఏఎన్ఎం తార ఆశవర్కర్లు విజయ,స్వప్న,శారద ఉన్నారు.
Tags: Keep the surroundings clean…