పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచండి
అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాస్
నంద్యాల ముచ్చట్లు:
నంద్యాల పట్టణాన్ని మరింత పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య ప్రజారోగ్య విభాగం శుద్ధ్య కార్యక్రమాలను సమర్ధంగా విధులు నిర్వహించాలని అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాస్ అదేశించారు. పట్టణంలోని యస్ బి ఐ కాలనీ. యమ్ జీ ఓ కాలనీ , టెక్కే. పద్మావతి నగర్. బైరమల్ స్టీట్. పలు ప్రాంతాల్లో బుధవారం నాడు పర్యటించారు. పట్టణంలోని అన్ని ముఖ్యమైన రహదార్ల వెంట పారిశుద్ధ్య కార్యక్రమాలను పూర్తిస్థాయిలో నిర్వహించాలని సిబ్బందికి సూచించారు. చెత్తాచెదారం, ఇతర వ్యర్థా లను ఎప్పటికప్పుడు తొలగించి అక్కడ నుంచి వెంటనే తరలించాలని ఆదేశించారు.కంపోటర్ల వాహనం లోకి చెత్తను చేర్చే విధానాన్ని అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాస్ పరిశీలించి వారికి తగిన సూచనలు చేశారు. ఈ సందర్భంగా శానిటరీ సెక్ర టరీల తీరుపై అసిస్టెంట్ కమిషనర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సచివాలయ సిబ్బంది హజరు పట్టికను పరిశీలించారు. అసిస్టెంట్ కమిషనర్ వెంకట దాస్ వెంట ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags: Keep the town clean