కేంద్రానికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్న కేజ్రీ

Kejri, who runs the pieces against the center

Kejri, who runs the pieces against the center

Date:09/10/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
కేంద్ర ప్రభుత్వంపై నిరసన గళం వినిపించే వారిలో ఢిల్లీ ముఖ్య మంత్రి కేజ్రీవాల్ ఒకరు.తాజాగా కేజ్రీవాల్ భాజపాయేతర రాష్ట్రాల ముఖ్య మంత్రులకు లేఖలు పంపారు. విద్యుత్‌ చట్టం-2003లో సవరణలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఆ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నారు కేజ్రీవాల్ .‘కొన్ని సంస్థలకు లాభాలు వచ్చేలా కేంద్ర ప్రభుత్వం దేశం మొత్తం విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటీకరణ చేయాలని భావిస్తున్నట్లు అనిపిస్తోంది. విద్యుత్‌ చట్టంలో సవరణలు తీసుకురావడం కోసం కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు అభ్యంతరకరంగా ఉన్నాయి,
పార్లమెంటులో ఈ బిల్లు ఆమోదం పొందకుండా మనం అందరం కలిసి అడ్డుకోవాల్సి ఉంది. ఈ బిల్లు వల్ల సామాన్య ప్రజలపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు పడతాయనే విషయాలను మనం ప్రచారం చేయాల్సి ఉంది’ అని ముఖ్యమంత్రులకు రాసిన లేఖల్లో కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. పశ్చిమ్‌ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్‌.డి కుమారస్వామి, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి.నారాయణ స్వామి, తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి,
మిజోరాం ముఖ్యమంత్రి లాల్ ‌తన్హ‌వ్‌లా, పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్, సిక్కిం ముఖ్యమంత్రి పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌లకు కేజ్రీవాల్ లేఖలు పంపారు.ఈ అంశాలపై చర్చించడానికి తాను ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవాలనుకుంటున్నానని ఆయన తెలిపారు. ఇప్ప‌టికే మూడో ఫ్రంట్ బీజేపీ క‌ల‌వ‌ర‌పెడుతుంది.
బీజేపీ యేత‌ర పార్టీల‌న్నీ క‌లిసి మూడో ఫ్రంట్ పెట్టే ప్ర‌తిపాద‌న జీవం పోసుకోక‌ముందే కేజ్రీవాల్ కొత్త ఎత్తు ఎటు దారి తీస్తుందోన‌ని సీనియ‌ర్‌లు భ‌య‌ప‌డుతున్నార‌ట‌. ఎన్నిక‌ల వేళ బీజేయేత‌ర శ‌క్తులు ఒక‌ట‌వుతే మోదీకి క‌ష్ట‌మే అన్న అభిప్రాయాలు వ్య‌క్తం అవుతున్నాయి.
Tags: Kejri, who runs the pieces against the center

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *