Natyam ad

మద్యం కుంభకోణంలో సీబీఐ ప్రశ్నలతో కేజ్రీవాల్ ఉక్కిరిబిక్కిరి..

అంతా ఆ ఫైల్ గురించే..!?

న్యూఢిల్లీ  ముచ్చట్లు:


ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ -CBI) కార్యాలయంలో హాజరయ్యారు. ఢిల్లీ మద్యం విధానం రూపకల్పన, అమలులో అక్రమాలు జరిగినట్లు, తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.2,600 కోట్లు నష్టం జరిగినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసులో ఆయనను సీబీఐ ఆదివారం ప్రశ్నించడం ప్రారంభించింది. ఈ సందర్భంగా సౌత్ లాబీ గురించి ఆరా తీసినట్లు తెలుస్తోంది.అసలు ఏమిటి ఈ మద్యం కుంభకోణం?
ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం 2021-22 సంవత్సరానికి మద్యం విధానాన్ని రూపొందించింది. దేశ రాజధాని నగరంలో లిక్కర్ ఇండస్ట్రీని పునరుజ్జీవింపజేయడం కోసం దీనిని రూపొందించింది. మొత్తం మద్యం వ్యాపారాన్ని ప్రైవేటు వ్యాపార సంస్థలు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని ప్రతిపాదించింది. అయితే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఈ విధానంలో అవకతవకలు జరిగాయని అనుమానించారు. అంతేకాకుండా ఈ విధానంలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు కూడా వచ్చాయి. అనంతరం దీనిపై దర్యాప్తు చేయాలని ఆయన సిఫారసు చేశారు. దీంతో ఈ విధానం అమలును ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఆ తర్వాత సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ -CBI), ఈడీ దర్యాప్తు జరుపుతున్నాయి. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీశ్ సిసోడియా కూడా అరెస్టయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కుమార్తె కవితను కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. ఈ కేసులో ఇప్పటికే సుమారు 11 మంది అరెస్టయి తిహార్ జైలులో ఉన్నారు.

 

 

 

Post Midle

ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌ను సీబీఐ ఓ సాక్షిగా పేర్కొంటూ, ప్రశ్నించడం ఆదివారం ప్రారంభించింది. ఆయనను సీబీఐ అడిగే ప్రశ్నలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేజ్రీవాల్‌ను అడుగుతున్న ప్రశ్నలు ఏమిటంటే…
1. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ రూపకల్పనలో మీ పాత్ర ఏమిటి? మద్యం వ్యాపారులు, సౌత్ లాబీ సభ్యులు ఈ విధానాన్ని రూపొందించేటపుడు ఎలాంటి ప్రభావం చూపించారు?
2. ఈ విధానం ఆమోదం పొందడానికి ముందు మీ ప్రమేయం ఏమిటి?
3. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, మద్యం వ్యాపారులతో కూడిన సౌత్ లాబీతో జరిగిన చాట్స్‌ను డిజిటల్ ఫోరెన్సిక్స్ ద్వారా సీబీఐ రాబట్టిందని తెలుస్తోంది. కేజ్రీవాల్‌ను ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేయడానికి దీనిని కూడా సీబీఐ ఉపయోగించుకుంటోంది. మద్యం విధానాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి మద్యం వ్యాపారులు, సౌత్ లాబీ సభ్యులు ఏ విధంగా ప్రభావం చూపించారో ఈ చాట్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇండోస్పిరిట్ గ్రూప్ దరఖాస్తుల విషయంలో కూడా కేజ్రీవాల్‌ కఠిన ప్రశ్నలను ఎదుర్కొంటున్నారు.
4. మద్యం విధానం రూపకల్పన సమయంలోనే సౌత్ లాబీకి అనుకూలంగా వ్యవహరించడం ప్రారంభించారా?

 

 

5. అదేవిధంగా ఇప్పటికే సీబీఐ, ఈడీ దర్యాప్తులో నిందితులు, సాక్షులు వెల్లడించిన వివరాలను ఆయన ముందు పెట్టి, వివరణ కోరుతోంది. సౌత్ లాబీ గురించి మరిన్ని వివరాలు రాబడుతోంది. ఈ విధానాన్ని ఆమోదించడానికి ముందు ఆయన ప్రమేయంపై ప్రశ్నిస్తోంది.
6. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కీలక నేతలతో సంబంధాల గురించి ఆరా తీస్తోంది. ఈ విధాన రూపకల్పనలో కొందరు మద్యం వ్యాపారులకు, సౌత్ లాబీకి అనుకూలంగా నిబంధనలను రూపొందించినట్లు కొందరు నిందితులు స్టేట్‌మెంట్లు ఇచ్చారు. దీనిపై కూడా సీబీఐ దృష్టి సారించి, వివరాలను రాబడుతోంది.
7. అన్నిటికన్నా ముఖ్యమైన మరో ప్రశ్న ఏమిటంటే, విధాన రూపకల్పన ప్రక్రియకు సంబంధించిన ఓ ముఖ్యమైన ఫైలు కనిపించకుండా పోయింది. దీనిని మంత్రి మండలి ముందు పెట్టవలసి ఉంది. కానీ దాని జాడ తెలియడం లేదు. దీని గురించి కేజ్రీవాల్‌ను సూటిగా ప్రశ్నిస్తోందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనికి అంత ప్రాధాన్యం ఎందుకంటే, నిపుణుల అభిప్రాయాలు, ప్రజాభిప్రాయం, లీగల్ ఒపీనియన్స్ దీనిలో ఉన్నాయి. అయితే దీనిని మంత్రి మండలి ముందు పెట్టకుండానే జాడ తెలియకుండా పోయింది.

 

Tags: Kejriwal choked with CBI questions in liquor scam.

Post Midle