కేటీఆర్ కు ఇన్నోవా కారే ఉందట

Ketiar does not have an Innova

Ketiar does not have an Innova

Date:20/11/2018
కరీంనగర్ ముచ్చట్లు:
తెలంగాణ ఎన్నిక‌ల ర‌ణ‌రంగంలో అతి ముఖ్య‌మైన ఘ‌ట్టం ముగిసింది. అభ్య‌ర్థుల‌తో పాటు ఆశావ‌హులు, రెబ‌ల్స్‌, ఇండిపెండెంట్లు అంద‌రూ నామినేష‌న్లు వేశారు. సోమ‌వారంతో ఆ గ‌డువు ముగిసింది. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ కూడా ముహూర్తం చూసుకుని సోమ‌వారం నామినేష‌న్ వేశారు. సాధార‌ణంగా పూజ‌లకు దూరం అని చెప్పే కేటీఆర్ ఈరోజు నామినేష‌ను వేశారంటే… ప్ర‌జా వ్య‌తిరేక‌త‌కు అత‌నికి దేవుడు క‌నిపించిన‌ట్టున్నాడు. పైగా తండ్రిలాగే చేతికి ప్ర‌త్యేక పూజా క‌వ‌చం క‌ట్టుకున్నారు. అంటే దేవుడ్ని న‌మ్మ‌ను అని ఇంత‌కాలం చెప్పిన‌వి క‌బుర్లే అన్న‌మాట‌.ఇక అఫిడ‌విట్లో కేటీఆర్ త‌న ఆస్తులు అప్పుల గురించి వెల్ల‌డించారు. అయితే, చిత్రంగా వాళ్ల ఆవిడ‌కు ఎక్కువ అప్పులు ఉండ‌టం విశేషం. ఆయ‌న చెప్పిన వివ‌రాల మేర‌కు కేటీఆర్‌కు కోటి 30 ల‌క్ష‌ల విలువైన స్థిరాస్తులు, రూ. 3.63 కోట్ల చరాస్తులు ఉన్నాయ‌ట‌. ఆయ‌న చేతిలో న‌గ‌దు ల‌క్షా 42 వేలు ఉంద‌ట‌. రేవంత్ రెడ్డిని త‌ర‌చూ విమ‌ర్శించే కేటీఆర్‌పై 16 కేసులున్న‌ట్లు ఈ అఫిడ‌విట్ ద్వారా జ‌నాల‌కు తెలిసింది. ఇక‌పోతే ఆయ‌న భార్య కేటీఆర్ కంటే సంప‌న్నురాలు. ఆమెకు రూ. 8.98 కోట్ల స్థిరాస్తి ఉంద‌ట‌. రూ. 27.70 కోట్ల చరాస్తులు ఉన్నాయి. అంటే ఆస్తులు భ‌ర్త‌కంటే ఆమెకు ఎక్కువున్నాయి. అప్పులు కూడా భ‌ర్త కంటే (రూ. 33.28 లక్షలు) భార్య పేరు మీద ఎక్కువున్నాయి. ఆమెకు మొత్తం రూ. 27.39 కోట్ల అప్పులు ఉన్న‌ట్లు తేలింది. కేటీఆర్ పేరు మీద కేవ‌లం ఒక ఇన్నోవా కారు మాత్ర‌మే ఉంద‌ట‌.
Tags:Ketiar does not have an Innova

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *