యూపీ రాజకీయాల్లో కీలక మార్పులు..
– ఎస్పీలో చేరిన ఇద్దరు బీజేపీ మంత్రులు
లక్నో ముచ్చట్లు:
యూపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నకొలది రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు బీజేపీకి చెందిన ముగ్గురు మంత్రులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. వీరిలో ఇద్దరు మంత్రులు, ఐదుగురు ఎమ్మెల్యేలు శుక్రవారం అఖిలేష్ యాదవ్ సమక్షంలో సమాజ్‌వాది పార్టీలో చేరారు. బీజేపీ మాజీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, ధరమ్ సింగ్ సైనీ ఎస్పీలో చేరారు. వీరితో పాటు మరో ఐదుగురు ఎమ్మెల్యేలు రోషన్‌లాల్ వర్మ, బ్రిజేష్ ప్రజాపతి, ముఖేష్ వర్మ, వినయ్ షాక్యా, భగవతి సాగర్, చౌదరి అమర్ సింగ్ తదితరులు అఖిలేష్ సమక్షంలో ఎస్పీ కండువ కప్పుకున్నారు.ఈ సందర్భంగా స్వామి ప్రసాద్ మౌర్య మాట్లాడుతూ.. ఇది బీజేపీ అంతానికి నాంది అన్నారు. యూపీని బీజేపీ దొపిడి నుంచి విముక్తి కల్పించాలన్నారు. అధికార బీజేపీ వెనుకబడిన వర్గాలపై వివక్ష కనబర్చిందని, వెనుక బడిన వర్గాల నాయకులను అవమాన పర్చిందని విమర్శించారు. యూపీని బీజేపీ రహిత రాష్ట్రంగా చేయాలన్నారు. కాగా, మౌర్య రాజీనామాతో బీజేపీ నుంచి వరద గేట్లు ఎత్తిన విధంగా మారిపోయింది.మౌర్య రాజీనామా చేసిన 72 గంటల్లోనే ఇద్దరు మంత్రులతో పాటు.. 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ధరమ్ సింగ్ సైనీ రాజీనామా చేసిన ఒక రోజు వ్యవధిలోనే అప్పాదళ్‌కు చెందిన అమర్ సింగ్, వినయ్ శుక్లా, ముఖేష్ వర్మ, బాల అవస్తీ తదితరులు రాజీనామా చేశారు. కాగా, మంత్రులు రాజీనామా చేయగానే అఖిలేష్ యాదవ్ వారితో దిగిన ఫోటోలను తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేస్తు వ్యూహత్మకంగా వ్యవహరించారు. కాగా, అఖిలేష్ యాదవ్ ఈసారి వెనుకబడిన వర్గాలను అధిక సీట్లలో బరిలోకి దింపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. వరుసగా వెనుకబడిన వర్గాల నాయకులు పార్టీని వీడటం ప్రస్తుతం బీజేపీలో చర్చనీయాంశంగా మారింది.
సంక్రాంతి పండుగ సంతోషంగా జరుపుకోవాలి – మంత్రి పెద్దిరెడ్డి , ఎంపి మిధున్‌రెడ్డి ఆకాంక్ష
Tags: Key changes in UP politics ..